Jamun Leaves: నేరేడు ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తప్పక తెలుసుకోవలసిన సమాచారం మీ కోసం..
మనలో చాలా మంది నిత్యం ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అలా కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే సరిపోతుంది. అలా ప్రకృతి నుంచి లభించే
మనలో చాలా మంది నిత్యం ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అలా కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, ఆహారపదార్థాలను ఎంచుకుంటే సరిపోతుంది. అలా ప్రకృతి నుంచి లభించే పండ్లలో నేరేడు పండ్లు చాలా కీలకమైనవి. నేరేడు పండ్లలో అనేక రకాల విటమిన్స్, క్రోమియం పుష్కలంగా లభిస్తాయి. నేరేడు కాయలలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇక ఆ చెట్టు ఆకులో అయితే చెప్పలేనన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నేరేడు చెట్టు ఆకులు, బెరడు, కాయలు ఇలా మొత్తం అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడతాయి. నేరేడు ఆకుల ద్వారా చాలా రకాల వ్యాధులను తగ్గించవచ్చు.
నేరేడు మన శరీరానికి శక్తినందించగలిగితే.. దాని ఆకులు మన ఆరోగ్యానికి మేలు చేయగలవు. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు ఆకుల సొంతం. మరి నేరేడు ఆకుల వల్ల మనకు కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
- నేరేడు చెట్టు చిగుర్ల నుంచి నాలుగు ఆకులను ప్రతిరోజు తినడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.
- అధిక మల విసర్జన సమస్యతో బాధపడేవారు నేరేడు ఆకుల కషాయాన్ని తాగితే ఉపశమనం పొందుతారు.
- కాలేయం పనితనం మెరుగుపడడానికి కూడా నేరేడు ఆకుల కషాయం ఉపకరిస్తుంది.
- జ్వరం నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ ఆకులు సహాయపడతాయి. నేరేడు ఆకుల రసంలో ధనియాలు వేసి తీసుకున్నట్లయితే జ్వరం తగ్గిపోతుంది.
- అధిక బరువుతో బాధపడేవారికి కూడా నేరేడు ఆకులు ఉపయోగపడతాయి.
- నేరేడు ఆకుల రసాన్ని ప్రతిరోజు నోటిలో పోసుకుని పుక్కిలిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. అంతే కాకుండా నోటి లోపల పుండ్లు, గాయాలు తలెత్తకుండా ఉంటాయి.
- ఏవైనా పురుగులు , దోమలు కుట్టి దద్దుర్లు మీ శరీరంపై వచ్చినట్లయితే.. ఈ ఆకుల రసాన్ని రాయడం వల్ల తగ్గిపోతుంది.
నేరేడు ఆకుల రసం తయారీ విధానం..
ఒక గ్లాస్ నీటిని వేడి చేయాలి. అవి మరుగుతున్న సమయంలోనే కొన్ని నేరేడు ఆకులను వేయాలి. మరిగిన తర్వాత నేరేడు ఆకుల రసం రుచిగా ఉండాలనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..