AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Time: అర్ధరాత్రి వరకూ నిద్రపోవడం లేదా? అయితే నిజంగా మీరు మేల్కోవాల్సిందే! లేకుంటే అంతే సంగతులు..

కానీ ఎప్పుడైతే నిద్ర తగ్గిపోతుందో. శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. అన్నీ రోగాలు చుట్టుముడతాయి. అందుకే మనిషి శరీరానికి కనీసం ఏడు గంటల పాటు సుఖ నిద్ర అవసరం. అది కూడా సరియైన సమయాల్లోనే నిద్రపోవాలి.

Sleeping Time: అర్ధరాత్రి వరకూ నిద్రపోవడం లేదా? అయితే నిజంగా మీరు మేల్కోవాల్సిందే! లేకుంటే అంతే సంగతులు..
Insomnia
Madhu
| Edited By: |

Updated on: Dec 28, 2022 | 4:42 PM

Share

నిద్ర.. మనిషికి చాలా అవసరం. నిరంతరాయంగా కనీసం 7-8 గంటల నిద్ర మనిషికి తప్పనిసరి. నిద్రలేమి సమస్య చాలా అనారోగ్యాలకు కారణమవుతుంది. కంటి నిండా నిద్ర ఉంటే శరీరం యాక్టివ్ గా ఉంటుంది. మనసు ఉల్లాసంగా మారుతుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి అధికమవుతుంది. బరువు,మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వంటి ప్రమాదకర రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. కానీ ఎప్పుడైతే నిద్ర తగ్గిపోతుందో. శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. అన్నీ రోగాలు చుట్టుముడతాయి. అందుకే మనిషి శరీరానికి కనీసం ఏడు గంటల పాటు సుఖ నిద్ర అవసరం. అది కూడా సరియైన సమయాల్లోనే నిద్రపోవాలి. అసమయాన పోయే నిద్ర ఆరోగ్యానికి మంచి చేయదని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

అర్ధరాత్రి వరకూ మేల్కోంటే..

చాలా మంది ప్రజలు రాత్రి 2 లేదా 3 గంటల వరకు మేల్కోని ఉండి, ఆలస్యంగా నిద్రపోతారు. కానీ 8 గంటల పాటు నిరంతరాయంగా నిద్రపోతారు. అయినప్పటికీ వారు దానితో వచ్చే అన్ని ప్రయోజనాలను పొందలేరు. ఎందుకంటే వారు సరైన సమయానికి నిద్రపోకపోవడమే కారణమని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు నేహా రంగ్లానీ. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో దీనిపై ఓ వీడియోను పోస్ట్ చేశారు. దానిలో ఏమన్నారంటే..

సరైన సమయంలోనే నిద్ర..

సరైన సమయంలో సరైన నిద్రను పొందడం మంచి ఆరోగ్యానికి హేతువుగా ఆమె పేర్కొన్నారు. చాలా మంది వ్యక్తులు ఆలస్యంగా నిద్రపోతారు.. అలాగే ఆలస్యంగా మేల్కొంటారు. కానీ 7-8 గంటల నిద్రను ఉంది కాబట్టి వారు ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటారు. కానీ వాస్తవం మరోలా ఉంటుందని నేహా వివరించారు.

ఇవి కూడా చదవండి

శరీర భాగాల పనితీరు ఇలా..

వైద్య శాస్త్రం ప్రకారం, మానవ కాలేయం కాలేయం తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల మధ్య గరిష్ట డిటాక్స్ దశలో ఉంటుంది. కాబట్టి మనం అర్ధరాత్రి తప్పనిసరిగా నిద్రపోవాలి. తద్వారా కాలేయం తన పని తాను చేసుకోగలుగుతుంది. అదేవిధంగా, మానవ ఊపిరితిత్తులు తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య చాలా చురుకుగా డిటాక్సిఫై అవుతాయి. అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాలు పొగ వంటి టాక్సిన్స్ నుంచి మన శరీరాన్ని రక్షించడానికి ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు అవసరం. కాబట్టి, ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు గాఢ నిద్రలో ఉండాలి. ఆలస్యంగా నిద్రపోవడం ద్వారా శరీర అవయవాల క్రియలకు విఘాతం ఏర్పడుతుంది. అంతే కాక రోజూ ఇలాగే కొనసాగితే అవయవాలు దెబ్బతిని రోగాలు చుట్టుముడతాయని నిపుణురాలు తన ఇన్ స్టా వీడియోలో వివరించారు.

ఎప్పుడు నిద్రపోవాలి..

సూర్యాస్తమయం, సూర్యోదయానికి అనుగుణంగా నిద్రపోవడం, మేల్కోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నిద్రలో శరీరం పునరుత్తేజితం అవుతుంది. అన్ని శరీర భాగాలు తమ శక్తిని తిరిగి పొందుకుంటాయి. పగటి పూట వినియోగించిన శక్తిని రాత్రి నిద్రతో తిరిగి పొందుకోగలం అని నేహా తన వీడియోలో చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..