AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Spices: మీ వంటింట్లోనే ఉండే ఈ 5 పదార్థాల ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి..

చలికాలం ప్రవేశించడమే ఆలస్యం అన్నట్లుగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలు మనల్ని ఎంతగానో వేధిస్తుంటాయి. ఈ సమస్యల  కారణంగా అనేక శరీర ఆరోగ్యం  క్షీణిస్తుంది. చలికాలాన్ని ఆస్వాదించవలసిన సమయంలో..

Indian Spices: మీ వంటింట్లోనే ఉండే ఈ 5 పదార్థాల ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి..
Indian Spices
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 28, 2022 | 3:49 PM

Share

చలికాలం ప్రవేశించడమే ఆలస్యం అన్నట్లుగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలు మనల్ని ఎంతగానో వేధిస్తుంటాయి. ఈ సమస్యల  కారణంగా అనేక శరీర ఆరోగ్యం  క్షీణిస్తుంది. చలికాలాన్ని ఆస్వాదించవలసిన సమయంలో మనల్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి. అందువల్ల చలికాలంలో ఎదురయ్యే సమస్యలు మన దరికి చేరకుండా ఉండేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. అలా చేయడం వల్ల మన శరీర వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. మరి అందుకోసం మనం పాటించవలసిన లేదా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే మన ఆహారంలో సరైన చేర్పులు చేసుకోవాలి.

సుగంధ ద్రవ్యాలు చక్కని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని మన పూర్వీకులు వంటలలోనూ, ఆయుర్వేదంలోనూ ఉపయోగించేవారు. అందువల్ల మనం కూడా శీతాకాలంలో సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ఈ సుగంధ ద్రవ్యాలను మన ఆహారంలోకి చేరిస్తే చాలు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాక ఆహారం రుచిని కూడా పెంచుతాయి. శీతాకాలంలో మనల్ని ఎక్కువగా వేధించే జలుబు, దగ్గు, ఫ్లూ సమస్యలను దూరంగా ఉంచడానికి అనేక రకాల సుంగధ ద్రవ్యాలు మన వంట గదిలోనే ఉంటాయి. మరి వాటిల్లో ప్రభావవంతంగా పనిచేసేవాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అల్లం: అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలం సమయంలో కూడా ఇది మన శరీరంలో వేడిని పుట్టిస్తుంది. అందుకోసమే చాలా మంది శీతాకాలంలో క్రమం తప్పకుండా అల్లం టీ తాగుతారు. మూలికా శీతల చికిత్సలో కూడా అల్లం సుదీర్ఘ చరిత్రనే కలిగి ఉంది. కొన్ని తేనె చుక్కలను తాజాగా తురిమిన అల్లం పొడి, వేడి నీరుతో కలిపి తాగితే  గొంతు నొప్పి, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

దాల్చిన చెక్క: దాల్చిన చెక్క వాసన మంచి అనుభూతిని కలిగించడమే కాక ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దాల్చిన చెక్కలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు.. ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్‌తో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 1/2 టీస్పూన్ దాల్చినచెక్క, తురిమిన అల్లం వేసి తేనెతో కలిపి తాగితే అన్ని తక్షణ ఉపశమనం ఉంటుంది.

మిరియాలు పొడి: యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా జలుబు, ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో మిరియాల పొడి సహాయపడుతుంది. మిరియాలను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.  ఫలితంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఛాతీలో మంట నుంచి ఉపశమనం కలుగుతుంది.

పసుపు: పసుపు ఒక యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది జలుబు, ఫ్లూ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. అల్లం-పసుపు మిశ్రమం జలుబుపై అద్భుతమైన ప్రభావం చూపుతుంది.

తులసి: తులసి ఆకులు యాంటి బాక్టీరియల్‌తో పాటు అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉన్నందున అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. అనేక వ్యాధులను నయం చేయడానికి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా తులసి ఎంతగానో ఉపకరిస్తుంది. తులసి ఆకులను నేరుగా లేదా పొడి చేసుకుని తీసుకోవచ్చు. కావాలంటే తులసి ఆకులతో టీ చేసుకుని కూడా తాగవచ్చు. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు వంటి శీతాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..