Healthy Food: ఆ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తినేస్తున్నారు! కానీ అవి చేసే నష్టం ఎంతో తెలుసా?
మన పెద్దలు కొన్ని సూచిస్తారు. వాటిని అలానే ఫాలో అయిపోతుంటాం. దానిలో లాజిక్ గురించి ఆలోచించం..
మన పెద్దలు కొన్ని సూచిస్తారు. వాటిని అలానే ఫాలో అయిపోతుంటాం. దానిలో లాజిక్ గురించి ఆలోచించం.. అలాగే కొన్ని ఫుడ్ ఐటెమ్స్ విషయంలో కూడా అంతే ఏదో ప్రచారంలో ఉంటుంది. దానినే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. ఇది మంచిది, అది తాగితే ఆరోగ్యం అంటూ ఉంటారు. అది నిజమేనని మనం కూడా నమ్మేస్తాం. అయితే వాస్తవం మరోలా ఉంటుంది. ఇప్పుడు మీకు అటువంటి కొన్ని ఆహార పదార్థాలు, పానీయాల గురించి వివరించాలని ఈ కథనం ఇస్తున్నాం. ఇప్పటి వరకూ మీరు ఈ పదార్థాలను చాలా ఆరోగ్యకరమని నమ్మి ఉంటారు. అయితే అసలు వాస్తవాలను ఇప్పుడు తెలుసుకోండి..
మనం రోజూ వారి బ్రేక్ ఫాస్ట్ లో పండ్ల రసాలు, తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య మంచిదని.. డైట్ సోడాలు బరువు తగ్గడంలో సహాయపడతాయని, స్పోర్ట్స్ డ్రింక్స్ ఆరోగ్యకరమైన శక్తిని అందిస్తాయని.. ఒక గ్లాసు రెడ్ వైన్ మన హృదయాలకు మంచిదని అందరూ అంటూ ఉంటారు. అయితే నిజం కొంచెం కష్టంగా ఉంటుంది.
పండ్ల రసాలు..
చాలా మంది పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచిదని విరివిగా తింటూ ఉంటారు. అయితే కెనడాకు హార్ట్ అండ్ స్ట్రోక్ ఫౌండేషన్ చేసిన అధ్యయనంలో అన్ని రకాల పండ్ల రసాల్లో చక్కెర శాతం అధికంగా ఉంటుందని నిర్ధారించింది. ఎనిమిది-ఔన్సుల రసం, కోలా రెండింటిలో సగటున 30 గ్రాముల చక్కెర ఉంటుందట. అంటే దాదాపు ఎనిమిది టీస్పూన్లు. ఇది ఆరోగ్యానికి చేటు చేసేదే. ఎందుకంటే సాధారణంగా జ్యూస్ చేసే టప్పుడు పై పండ్ల పొట్టును తీసివేస్తారు. అలాగే రసం చేయగా వచ్చిన గుజ్జును కూడా తీసివేస్తారు. ఫలితంగా కాయల్లోని శరీరానికి మంచి చేసే ఫైబర్ మొత్తం బయటకు పోయి.. కేవలం చక్కెర మాత్రమే లోపలికి వెళ్తుంది.
వెజ్జీ చిప్స్..
కుకింగ్ లైట్ అనే హెల్తీ ఈటింగ్ మ్యాగజైన్ చెప్పిన దాని ప్రకారం వెజ్జీ చిప్ తినడం కంటే బంగాళదుంప చిప్స్ తినడం ఆరోగ్యకరమని పేర్కొంది. కమర్షియల్ గా లభించే వెజ్జీ చిప్స్ లో బంగాళాదుంప చిప్స్ కంటే సోడియం ఎక్కువగా ఉంటుంది.. వాస్తవానికి వెజ్జీ చిప్స్ తినేవారు బచ్చలికూర, దుంపలు లేదా గుమ్మడికాయలను నుంచి వచ్చినది కదా ఇది చాలా ఆరోగ్యం కదా అనుకుంటారు. కానీ వాస్తవం మరోలా ఉంది. చిప్ లవర్స్ నట్స్ లేదా తాజా కూరగాయలను ఎంచుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరి నూనె..
కొబ్బరి నూనె చాలా విశిష్ట ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని అనేక రకాలుగా వినియోగిస్తారు. వంట నూనె గా వాడతారు, ఫేషియల్ మాయిశ్చరైజర్ గా వినియోగిస్తారు, హైర్ మాస్క్, మేక్ అప్ రిమూవర్ గా కూడా వాడతుంటారు. అయితే దీనిని ఆహారంగా తీసుకోవడం అంత శ్రేయస్కకరం కాదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె రోజూ తీసుకుంటే శరీరంలో చెబు కొవ్వు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఫలితంగా చెబు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుందని వివరిస్తున్నారు.
డైట్ సోడాలు..
డైట్ సోడాలో మంచి రుచిన అందించడానికి ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను వినియోగిస్తారు. నిజమైన సోడాలా కనిపిస్తుంది కానీ కాదు. దీని వల్ల గుండె, కాలేయ సమస్యలు, ఊబకాయం , స్ట్రోక్, మధుమేహంతో సహా అనేక రకాల రుగ్మతలు చుట్టుముడతాయని నిపుణులు చెబుతున్నారు.
వెజ్జీ బర్జర్స్..
వెజ్జీ బర్జర్స్ ద్వారా వచ్చే ఆరోగ్యకర ప్రయోజనాలు అది తయారు చేసే విధానంపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా దీని తయారీకి కొన్ని రకాల కొవ్వులను కలుపుతారు. దానిలో శ్యాచురేటెడ్ కొవ్వులు అంటే కొబ్బరి నూనె, పామ్ ఆయిల్ లను వినియోగిస్తారు. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదం చే స్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
ప్లేవర్డ్ పెరుగు..
పెరుగు సాధారణంగా కొంచెం పులుపు రుచిని కలిగి ఉంటుంది. ఎందుకంటే అది తయారయ్యే బ్యాక్టీరియా కారణం. అయితే దీనిని అధిగమించడానికి పెరుగులో చాలా మంది కొన్ని ఫ్లేవర్స్ ను కలిపి తియ్యగా చేసుకొని తింటుంటారు. ఇది కూడా ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. అవకాశం ఉన్నంత వరకూ పెరుగును పెరుగు లాగే తీసుకోవాలని సూచిస్తున్నారు.
రెడ్ వైన్..
సాధారణంగా ఏ ఆల్కాహాల్ అయినా ఆరోగ్యానికి హాని చేసేదే. అది బీర్ అయినా విస్కీ అయినా రమ్ అయినా. కానీ ఒక్క రెడ్ వైన్ పై మాత్రమే భిన్నమైన అభిప్రాయం ఉంది. దీనిని రోజూ తగు మోతాదులో తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చని చెబుతారు. అయితే దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇది ఎంత వరకూ నిజం అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే రెడ్ వైన్ తరచూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కారక కణాలు శరీరంలో వృద్ధి చెందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవకాశం ఉన్నంత వరకూ ఆల్కాహాల్ అనుబంధ పానీయం ఏదైనా మానివేయడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..