AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

President Murmu: భద్రాద్రి రాముడి సేవలో రాష్ట్రపతి.. తెలుగులో అభివాదం.. ద్రౌపది ముర్ము రేపటి షెడ్యూల్ ఇదే..

సోమవారం శ్రీశైల క్షేత్రానికి వెళ్లిన రాష్ట్రపతి ముర్ము యునెస్కో గుర్తింపు పొందిన రామప్పగుడిని ఈ రోజు సందర్శించారు. రామప్ప గుడి అందాలు, గొప్పదనం గురించి ఆమె తెలుసుకున్నారు. రామప్ప ఆలయాన్ని

President Murmu: భద్రాద్రి రాముడి సేవలో రాష్ట్రపతి.. తెలుగులో అభివాదం.. ద్రౌపది ముర్ము రేపటి షెడ్యూల్ ఇదే..
Droupadi Murmu In Telangana
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 28, 2022 | 8:33 PM

Share

శీతాకాల విడిది కోసం ఈ నెల 26న హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్నారు. సోమవారం శ్రీశైల క్షేత్రానికి వెళ్లిన రాష్ట్రపతి ముర్ము యునెస్కో గుర్తింపు పొందిన రామప్పగుడిని ఈ రోజు(డిసెంబర్ 28) సందర్శించారు. రామప్ప గుడి అందాలు, గొప్పదనం గురించి ఆమె తెలుసుకున్నారు. రామప్ప ఆలయాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతి ముర్మునే కావడం చెప్పుకోవలసిన విశేషం. అంతకముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము భద్రాచలానికి చేరుకున్న నేపథ్యంలో గిరిజన సంప్రదాయ నృత్యాలు కొమ్ము, రేలా నృత్యాలతో సాదరస్వాగతం పలికారు. కాకతీయుల కళాసంపదకు నిలువెత్తు నీరాజనమైన రామప్ప మందిరం గొప్పదనాన్ని ముర్ము తెలుసుకున్నారు. ఆ మందిర శిల్పా కళా వైభవాన్ని ఆమెకు అధికారులు వివరించారు. రామప్ప గుడిలో పూజలు చేసిన రాష్ట్రపతికి.. వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

అనంతరం, ఓరుగల్లుకు సాంస్కతికంగా పేరు తెచ్చిన కళా నృత్యరూపాల్ని రాష్ట్రపతి ముర్ము సమక్షంలో ప్రదర్శించారు. పేరిణి శివతాండవాన్ని స్వయంగా చూశారు రాష్ట్రపతి. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా  ప్రదర్శించే కొమ్ముకోయ నృత్యాన్ని తిలకించారు ఆమె. వీటితోపాటు ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ అనే అన్నమాచార్య కీర్తనను నృత్యరూపంగా ప్రదర్శించారు కళాకారులు.  భద్రాచలం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము-ఆదివాసీలతో పాటు సమ్మక్క సారలమ్మ గిరిజన పూజారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా- వనవాసి కల్యాణ్‌ పరిషత్‌ సభ్యులు రాష్ట్రపతిని సన్మానించారు. అంతకముందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము- భద్రాద్రి సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ప్రసాద్ పథకం పనులకు శంకుస్థాపన చేశారు.

నా తెలంగాణా కోటి రతనాల వీణ అంటూ..

ప్రముఖ కవి దాశరధి కవితా పంక్తులను గుర్తు చేసిన రాష్ట్రపతి ‘నా తెలంగాణా కోటి రతనాల వీణ’ అని ప్రస్తావించారు. తెలంగాణాలో మొదటి పర్యటనలో దేశ ప్రజలకోసం తెలంగాణ ఆలయాల్లో ప్రార్ధించే అవకాశం లభించిందని  ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు గిరిజన, మారుమూల ప్రాంతాల పిలల్ల విద్యా అవసరాలను తీరుస్తున్నాయన్నారు. ఇతర ప్రాంతాల గిరిజన బాలలను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయటం పట్ల రాష్ట్ర పతి సంతోషం వ్యక్తం చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి పంక్తులను చదివి వినిపించారు రాష్ట్రపతి ముర్ము. తెలుగు నేర్చుకోవడానికి తనకు సమయం పడుతుందని, కానీ తెలుగు నేర్చుకుంటానని చెప్పారామె. తెలంగాణకు తాను రావడం ఇదే తొలిసారి అంటూ ముర్ము చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో తీర్థక్షేత్రాలను దర్శించి, తాను ముగ్దురాలిని అయ్యానని ముర్ము చెప్పారు. పర్యాటక రంగం వల్ల కూడా ఈ క్షేత్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

ఇవి కూడా చదవండి

రేపటి షెడ్యూల్:

ఈ నెల 30వ తేదీ వరకు తెలంగాణలోనే ఉండనున్న రాష్ట్రపతి ముర్ము రేపు(డిసెంబర్ 29) జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(మహిళల) విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులతో సంభాషిస్తారు. తర్వాత హైదరాబాద్‌లోని బిఎం మలానీ నర్సింగ్ కాలేజ్, సుమన్ జూనియర్ కాలేజ్ ఆఫ్ మహిళా దక్షతా సమితి విద్యార్థులు, సిబ్బందితో ముచ్చటించనున్నారు. అదే క్రమంలో శంషాబాద్‌లోని శ్రీరామనగరంలో ఉన్న సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. ఇక డిసెంబర్ 30న యాదగిరిగుట్ట దేవస్థానాన్ని సందర్శించిన తర్వాత.. ఢిల్లీకి తిరుగు పయనమవుతారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..