TS 10th Class Exms 2023: విద్యార్ధులకు అలర్ట్‌! ఏప్రిల్‌ 3 నుంచి తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ 2022-23 పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం (డిసెంబర్‌ 28) వెల్లడించారు. పది పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఈ రోజు అధికారులతో..

TS 10th Class Exms 2023: విద్యార్ధులకు అలర్ట్‌! ఏప్రిల్‌ 3 నుంచి తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు
TS 10th Class Time Table 2023
Follow us

|

Updated on: Dec 28, 2022 | 10:00 PM

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ 2022-23 పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం (డిసెంబర్‌ 28) వెల్లడించారు. పది పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించాలన్నారు. వందశాతం పూర్తి సిలబస్‌తో పరీక్షలు నిర్వహించాలన్నారు.

కాగా తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసిన విషయం తెలిసిందే. గతంలో 11 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తుండగా.. 9, 10 తరగతులకు పదకొండు పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పేర్కొంటూ.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాజా సంస్కరణలు 2022-23 నుంచి సంస్కరణలు అమలు అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు, సైన్స్‌ సబ్జెక్టులో మాత్రం ఫిజిక్స్‌, బయోలజీకి ఒక్కో విభాగానికి 50 మార్కుల చొప్పున ఉంటాయని వెల్లడించింది. ఒక్క సైన్స్‌ పేపర్‌కు మాత్రం 3 గంటల 20 నిమిషాల సమయం పరీక్షకు కేటాయిస్తారు. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు పరీక్షా సమయం ఉంటుంది.

ఇక ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్‌ ఉంటుందని మంత్రి అన్నారు. చిన్న ప్రశ్నలకు ఛాయిస్‌ ఉండదన్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన మోడల్‌ క్వశ్చన్ పేపర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహించాలన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ పైనల్‌ పరీక్షలు ఉంటాయని మంత్రి సభిత అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles