CRPF Recruitment 2022: ఇంటర్ అర్హతతో.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 1458 ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రూ.92 వేల జీతం..
భారత్ ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్.. 1458 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటిల్లో..
భారత్ ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్.. 1458 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటిల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 143, హెడ్ కానిస్టేబుల్ పోప్టులు 1315 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పురుషుల ఎత్తు 165 సెంటీమీటర్లు, మహిళల ఎత్తు 155 సెంటీమీటర్లు ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 25, 2023 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 25, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4, 2023 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఏఎస్సై పోస్టులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం..
మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 100 మార్కులకు గంటన్నర సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. హిందీ/ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.