Covid Surge in India: కేంద్రం హెచ్చరికలు..’రాబోయే 40 రోజులు చాలా కీలకం.. జనవరి మధ్యలో భారీగా కోవిడ్‌ కేసులు’

కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ BF.7 దాటికి ప్రపంచదేశాలు మరో మారు ఉలిక్కిపడుతున్నాయి. కొత్త వేరియంట్ల వల్ల ప్రమాదం లేదని ఓ వైపు నిపుణులు చెబుతున్నప్పటికీ.. పెరుగుతున్న కేసుల దృష్ట్యా వివిధ దేశాలు హై అలర్ట్‌ ప్రకటిస్తున్నాయి. ఇక భారత్‌లో..

Covid Surge in India: కేంద్రం హెచ్చరికలు..'రాబోయే 40 రోజులు చాలా కీలకం.. జనవరి మధ్యలో భారీగా కోవిడ్‌ కేసులు'
Covid 4th Wave In India
Follow us

|

Updated on: Dec 28, 2022 | 5:24 PM

కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ BF.7 దాటికి ప్రపంచదేశాలు మరో మారు ఉలిక్కిపడుతున్నాయి. కొత్త వేరియంట్ల వల్ల ప్రమాదం లేదని ఓ వైపు నిపుణులు చెబుతున్నప్పటికీ.. పెరుగుతున్న కేసుల దృష్ట్యా వివిధ దేశాలు హై అలర్ట్‌ ప్రకటిస్తున్నాయి. ఇక భారత్‌లో మునుపటి మాదిరిగానే జనవరి మధ్యలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే 40 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా స్వదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల్లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు కూడా గనణీయంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్‌ నియంత్రణ, తీసుకోవల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్, వ్యాక్సినేషన్‌పై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దృష్టి పెట్టాలని ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశాలు జారీ చేశారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు మంత్రి గుర్తు చేశారు.

అందిన సమాచారం మేరకు.. దేశ రాజధానిలో 60 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చే ఉచిత కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్‌లు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీంతో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంత వరకు రూ.386లు చెల్లించి ప్రైవేట్‌గా వ్యాక్సిన్లు వేయించుకోవల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఇంట్రానాసల్ వ్యాక్సిన్లు ఒక్కోటి రూ.800లకు పైనే ఉంది. వీటి కోసం కోవిన్‌ పోర్టల్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చ. ఇంట్రానాసల్ వ్యాక్సిన్లు జనవరి 4వ వారం నుంచి ప్రజలకు ఇవ్వనున్నారు. ముంబయిలో గత మూడు రోజుల్లో దాదాపు 32 శాతం కేసులు పెరిగాయి. తమిళనాడులో బుధవారం నలుగురు అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.