PM Modi: అహ్మదాబాద్ ఆస్పత్రిలో తల్లిని పరామర్శించిన ప్రధాని మోడీ.. భారీ బందోబస్తు
దేశం ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మోహతా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా..
దేశం ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మోహతా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వెంటనే అహ్మదాబాద్‌కు బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే ఆస్పత్రిలోని తల్లిని పరామర్శించారు. ఆమె ఆరోగ్యంపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హీరాబెన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రధానికి వివరించారు. వయసు రీత్యా, ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు. తల్లి ఆరోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుటిన అహ్మదాబాద్‌కు చేరుకుని తల్లిని పరామర్శించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రధాని మోడీ రాకను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
#WATCH | PM Modi arrives at UN Mehta Institute of Cardiology & Research Centre in Ahmedabad where his mother Heeraben Modi is admitted
As per the hospital, her health condition is stable. pic.twitter.com/j9Yp3udunB
— ANI (@ANI) December 28, 2022
వందేళ్లు పూర్తి చేసుకున్న హీరాబెన్
కాగా, హీరాబెన్ వయస్సు 100 ఏళ్లు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఆమెకు కాళ్లు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. హీరా బెన్ గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు పంకజ్‌భాయ్‌తో కలిసి బృందావన్ బంగ్లాస్-2, రైసన్, గాంధీనగర్‌లో నివసిస్తున్నారు.
రాహుల్ గాంధీ ట్వీట్
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో రాహుల్ గాంధీ స్పందించారు. ఆమె ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి