తమిళనాడులో దడపుట్టిస్తోన్న కరోనా.. ఎయిర్‌పోర్టులో నలుగురికి పాజిటివ్‌..

చైనాలో కరోనా నానాటికి భీభత్సం సృష్టిస్తోంది. రోజూ లక్షల మంది ప్రజలు మృతి చెందుతున్నారు. మార్చురీలు, స్మశానల్లో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇక ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 పాజిటివ్‌ కేసులు కూడా..

తమిళనాడులో దడపుట్టిస్తోన్న కరోనా.. ఎయిర్‌పోర్టులో నలుగురికి పాజిటివ్‌..
Chennai Airport
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 28, 2022 | 3:59 PM

చైనాలో కరోనా నానాటికి భీభత్సం సృష్టిస్తోంది. రోజూ లక్షల మంది ప్రజలు మృతి చెందుతున్నారు. మార్చురీలు, స్మశానల్లో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇక ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 పాజిటివ్‌ కేసులు కూడా పలు దేశాల్లో భారీగా నమోదవుతున్నాయి. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వారు అధికంగా కరోనా బారీన పడుతున్నారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో మంగళవారం (డిసెంబర్‌ 27) ఉదయం ఇద్దరికి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినట్లు తేలింది. చైనా నుంచి వచ్చిన ఓ మహిళ, ఆమె కుమార్తెకు కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో క్వారంటైన్‌కు తరలించారు. బుధవారం (డిసెంబర్‌ 28)న కూడా దుబాయ్‌ నుంచి చెన్నైకి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. వీరిని కూడా క్వారంటైన్‌కు తరలించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ టెస్టులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంగళ, బుధ వారాల్లో మదురై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు కరోనా టెస్టులు చేశారు. తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు ఈ నలుగురి శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.