నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు.. ఆందోళనకరంగా కరోనా మహమ్మారి విజృంభణ

కరోనా ఉధృతి మళ్లీ ప్రారంభమైంది. అటు చైనాలో రోజుకు పది లక్షల కేసులు నమోదవుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మళ్లీ అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌తోపాటు పలు దేశాలు..

నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు.. ఆందోళనకరంగా కరోనా మహమ్మారి విజృంభణ
New Year Celebration Rules
Follow us

|

Updated on: Dec 28, 2022 | 3:24 PM

కరోనా ఉధృతి మళ్లీ ప్రారంభమైంది. అటు చైనాలో రోజుకు పది లక్షల కేసులు నమోదవుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మళ్లీ అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌తోపాటు పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యలకు పూనుకుంటున్నాయి. ఇక దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌ 7 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరో మూడు రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడి వేడుకలు జరుపుకుంటారు. దీంతో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించింది. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ బుధవారం (డిసెంబర్‌ 28) ఆదేశాలు జారీ చేశారు.

కాగా గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా నూతన సంవత్సర వేడుకలు నిషేధించిన విషయం తెలిసిందే. ఐతే ఈ ఏడాది కోవిడ్‌ ఉధృతి కొంత తగ్గుముఖం పట్టడంతో 2023 నూతన సంవత్సర సంబరాలు ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలను జారీ చేసింది. వేడుకల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్‌లను వినియోగించాలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.