PM Modi Mother Hospitalized Highlights: ఆస్పత్రిలో తల్లిని పరామర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ

| Edited By: Subhash Goud

Updated on: Dec 28, 2022 | 6:29 PM

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. ఆమెను అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

PM Modi Mother Hospitalized Highlights: ఆస్పత్రిలో తల్లిని పరామర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ
Heeraben Modi

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. ఆమెను అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు. వయసు రీత్యా, ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. తల్లి ఆరోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తల్లి ఆరోగ్య వార్త విన్న తర్వాత ఒకరి తర్వాత మరొకరు ఎమ్మెల్యేలు UN మెహతా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. అహ్మదాబాద్ ఎమ్మెల్యే దర్శనాబెన్ వాఘేలా, దర్యాపూర్ ఎమ్మెల్యే కౌశిక్ జైన్ UN మెహతా ఆసుపత్రికి చేరుకున్నారు.

ప్రధానమంత్రి మోదీ తల్లి హీరాబెన్ వయస్సు 100 ఏళ్లు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఆమెకు కాళ్లు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హీరా బెన్ గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు పంకజ్‌భాయ్‌తో కలిసి బృందావన్ బంగ్లాస్-2, రైసన్, గాంధీనగర్‌లో నివసిస్తున్నారు.

హీరాబా జూన్ 18, 1923న జన్మించారు. హీరాబెన్ మోదీ 18 జూన్ 2022న తన జీవితంలో 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది కూడా గాంధీనగర్ రైసన్‌లోని తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆశీస్సులు తీసుకోవడానికి ప్రధాని మోదీ ఇంటికి చేరుకున్నారు. ఉదయాన్నే తన నివాసానికి చేరుకుని హీరాబా ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కొడుకులా హీరాబా పాదాల దగ్గర కూర్చొని తన తల్లి కాళ్లను ప్రధాని కడిగారు. ఆయన ఆశీస్సులు కూడా పొందారు.

వార్తలకు సంబంధించిన అప్‌డేట్ కొనసాగుతోంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Dec 2022 05:37 PM (IST)

    ఆస్పత్రిలో తల్లిని పరామర్శించి ఢిల్లీ బయలుదేరిన మోడీ

    ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో తన తల్లిని పరామర్శించారు. అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తల్లి హీరాబెన్‌ ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

  • 28 Dec 2022 04:27 PM (IST)

    హీరాబెన్‌ త్వరగా కోలుకోవాలి: మల్లిఖార్జున్‌ ఖార్గే

    ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖార్గే ప్రార్థించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

  • 28 Dec 2022 03:58 PM (IST)

    ఆస్పత్రిలో తల్లిని పరామర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ

    ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మోహతా ఆస్పత్రిలో తల్లిని పరామర్శించారు. అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్ల్లి హీరాబెన్‌ను మోడీ పరామర్శించారు. ఆమె ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హీరాబెన్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  • 28 Dec 2022 03:54 PM (IST)

    అహ్మదాబాద్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ

    ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని మోడీ పరామర్శించనున్నారు. ఆమె ఆరోగ్యంపై వివరాలు తెలుసుకోనున్నారు. కాగా, ప్రస్తుతం మోడీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  • 28 Dec 2022 03:27 PM (IST)

    మోడీ తల్లి ఆరోగ్యంపై రాహుల్‌గాంధీ ట్వీట్‌

    ప్రధాని నరేంద్ర మోడీ తల్లి అనారోగ్య వార్త విన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఆమె ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించారు. హీరాబెన్‌ ఆరోగ్యంగా మెరుగుపడాలని ఆయన ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు.

  • 28 Dec 2022 03:25 PM (IST)

    మోడీ తల్లి ఆరోగ్యంపై ప్రార్థనలు

    ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఫోటోతో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రార్థనలు చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని పలువురు ప్రార్థనలు చేస్తున్నారు.

  • 28 Dec 2022 02:58 PM (IST)

    4 గంటలకు అహ్మదాబాద్‌కు ప్రధాని మోడీ

    ప్రధాన నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకోనున్నారు. తల్లి హీరాబెన్‌ అవస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో మోడీ అహ్మదాబాద్‌కు రానున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రధాని నేరుగా అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి చేరుకుంటారు.

  • 28 Dec 2022 02:50 PM (IST)

    ఆస్పత్రికి చేరుకున్న సీఎం భూపేంద్ర పటేల్

    సీఎం భూపేంద్ర పటేల్ యూఎన్ మెహతా ఆస్పత్రికి చేరుకున్నారు. హీరా బా ఆరోగ్య వార్త విన్న ముఖ్యమంత్రి వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఆమె గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం హీరాబెన్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య వివరాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

    అలాగే ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది. హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఆస్పత్రికి తరలి వస్తున్నారు.

  • 28 Dec 2022 02:47 PM (IST)

    ఆస్పత్రికి చేరుకున్న ఆరోగ్య మంత్రి రిషికేష్ పటేల్

    ప్రధాని మోదీ తల్లి హీరాబా ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆరోగ్య మంత్రి రిషికేశ్ పటేల్ ఆస్పత్రికి చేరుకున్న ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

  • 28 Dec 2022 02:14 PM (IST)

    ఆస్పత్రిలో మంత్రులు, ఎమ్మెల్యేలు

    ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈరోజు హీరాబా ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ప్రస్తుతం ఆస్పత్రికి చేరుకుని హీరాబా ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.

  • 28 Dec 2022 02:09 PM (IST)

    యూఎన్ మెహతా ఆస్పత్రికి సీఎం భూపేంద్ర పటేల్

    ప్రస్తుతం హీరాబా ఆరోగ్యం నిలకడగా ఉంది. మంత్రులు, అధికారులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. సీఎం భూపేంద్ర పటేల్ కొన్ని నిమిషాల్లో యూఎన్‌ మెహతా ఆసుపత్రికి చేరుకోనున్నారు.

  • 28 Dec 2022 02:03 PM (IST)

    ఆసుపత్రి వద్ద పోలీసుల భద్రత పెంపు

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్ వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే యుఎన్ మెహతా ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

  • 28 Dec 2022 02:01 PM (IST)

    108కి ఫోన్ చేసి గాంధీనగర్‌లోని సివిల్ ఆసుపత్రికి..

    యుఎన్ మెహతా హాస్పిటల్ అధికారిక బులెటిన్ విడుదలైంది. హీరబ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని సమాచారం. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబా ఆరోగ్యం క్షీణించింది. 108కి ఫోన్ చేసి గాంధీనగర్‌లోని సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. అంతే కాదు సాధారణ రోగుల మాదిరిగానే ఆసుపత్రిలోని జనరల్ వార్డులో వారిని పరీక్షించారు.

  • 28 Dec 2022 01:54 PM (IST)

    తల్లిని పరామర్శించడానికి ప్రధాని మోదీ వచ్చే అవకాశం..

    అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించడానికి ప్రధాని మోదీ అహ్మదాబాద్‌ వెళ్లే అవకాశముంది. యూఎన్‌ మెహతా ఆస్పత్రితో పాటు అహ్మదాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • 28 Dec 2022 01:50 PM (IST)

    ప్రధాని మోదీ మోదీ తల్లి ఆరోగ్యంపై హెల్త్ బులిటన్..

    తల్లి ఆచూకీపై ఆరా తీసేందుకు ప్రధాని మోదీ కూడా గుజరాత్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే, హీరాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఇప్పుడు ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది.

    Health Bulletin

    Health Bulletin

  • 28 Dec 2022 01:37 PM (IST)

    ఆస్పత్రికి చేరుకుంటున్న బీజేపీ శ్రేణులు

    కైలాసనాథన్ యుఎన్ మెహతా ఆసుపత్రికి చేరుకున్నారు. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే దర్శనాబెన్ వాఘేలా, ఎమ్మెల్యే కోషిక్ జైన్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీ అహ్మదాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

  • 28 Dec 2022 01:24 PM (IST)

    ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ తీవ్ర అస్వస్థత..

    ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. ఆమెను అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు.

Published On - Dec 28,2022 1:24 PM

Follow us