Ashwini Vaishnaw: ‘వసుధైవ కుటుంబం’.. G20 గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి..
భారత్‌లో సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ-20 సదస్సు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. జీ20 - 2023 సదస్సు అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నుంచి స్వీకరించిన నాటినుంచి..
భారత్‌లో సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ-20 సదస్సు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. జీ20 – 2023 సదస్సు అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నుంచి స్వీకరించిన నాటినుంచి.. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు అనేక వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో జీ-20 సదస్సునకు సంబంధించి ఇప్పటికే కేంద్రంలో మోడీ ప్రభుత్వం విపక్ష పార్టీలతో సమావేశమై పలు సలహాలు, సూచనలను సైతం పరిగణలోకి తీసుకుంది. అంతేకాకుండా దేశంలోని 56 నగరాలు, పట్టణాలలో మొత్తం వివిధ అంశాలకు సంబంధించి 200 సదస్సులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయం, ఆర్థిక రంగం, విద్య, వైద్యం, నూతన ఆవిష్కరణలు ఇలా.. అనేక అంశాలపై 37 సమావేశాలను నిర్వహించనుంది. ప్రపంచ పరిస్థితులు.. జీ20 భాగస్వామ్య దేశాల సహకారం.. దౌత్య సంబంధాలను పరిగణలోకి తీసుకుని ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
జీ20 సన్నాహక సమావేశాల్లో భాగంగా కేంద్ర సమాచార శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్.. G20 గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ప్రోగ్రామ్ అండ్ స్టే సేఫ్ ఆన్‌లైన్ ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు. G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ లో భాగంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ రూపంలో పరిష్కారాలను కనుగొనేందుకు.. నూతన ఆవిష్కర్తలను గుర్తించడం, అలాంటివారికి మద్దతునివ్వడమే లక్ష్యంగా భారత్ ముందుకుసాగుతోంది. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సంబంధిత థీమ్‌లను సైతం విడుదల చేసింది. “వసుధైవ కుటుంబం – ఒకే భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు” అనే థీమ్‌కు అనుగుణంగా ప్రపంచానికి కావాలసిన అంశాలపై ప్రధానమంత్రి దృష్టి సారించారని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో డిజిటల్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరిన్ని ప్రాంతాల్లో 5జీ సేవలను విస్తరించనున్నట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
Union Minister of Communications, Electronics & IT @AshwiniVaishnaw commenced the launch of G20 Global Digital Innovation Alliance Program and Stay Safe Online Campaign.@g20org @GoI_MeitY pic.twitter.com/Gc4uqDVxjM
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) December 28, 2022
G20 డిజిటల్ ఇన్నోవేషన్ భాగంగా సాంకేతిక రంగం సహకారంతో ఆర్ధిక రంగం బలోపేతం, నూతన ఆవిష్కరణలను పెంపోందించడం తదితర అంశాలను చర్చించారు. G20లో భాగమైన దేశాలకు, అదేవిధంగా ఆహ్వానించిన సభ్య దేశాల్లో డిజిటల్ ఆవిష్కరణలను పెంపొందించడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం పలు కార్యక్రమాలు, సెషన్‌లు, వర్క్‌షాప్‌లు, నిపుణుల సూచనలతో సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ప్రతి సభ్య దేశం దాని జ్యూరీని అలాగే ప్రాతినిధ్యం వహించాల్సిన టాప్ 6 ఆవిష్కరణలను ఎంచుకోవడానికి, వారి సొంత ఆవిష్కరణల ఎంపికల కోసం ప్రమాణాలను రూపొందించనుంది.
కాగా, ఈ థీమ్ లో సభ్య దేశాల నుండి నామినేషన్లు స్వీకరించడానికి గడువు 15 మే 2023 గా నిర్ణయించారు. ప్రతి సభ్య దేశం (ఆహ్వానించిన సభ్య దేశాలతో సహా) టాప్ 6 ఇన్నోవేషన్ ఎంట్రీలను నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. భారత్‌లో ఆగస్టు నెలలో మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో ఇన్నోవేషన్ షోకేస్, వాటాదారులతో పరస్పర చర్యలు, ప్రతి థీమ్ కింద మెంటరింగ్ సెషన్‌లు, పెట్టుబడి – ప్యానెల్ చర్చలు ఉంటాయి. దీంతో పలు కంపెనీలు, వ్యాపారవేత్తలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. పర్యావరణ రహితమైన సాంకేతికతను పెంచే విధంగా పలు ప్రాజెక్టులను ప్రవేశపెట్టనున్నారు.
ఈ జ్యూరీలో ప్రతి కేటగిరీలో టాప్ 3 డిజిటల్ ఆవిష్కరణలను ఎంపిక చేయడంతోపాటు.. ఫైనల్ అవార్డులను శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించనున్నారు. దీంతోపాటు ప్రతీ రంగానికి సంబంధించిన విషయాలను సవివరంగా బుక్‌లెట్‌ల రూపంలో ఆవిష్కరించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..