Rahul Gandhi: టీ షర్ట్ సిక్రెట్ బయటపెట్టిన రాహుల్ గాంధీ.. అప్పటివరకు కొనసాగిస్తానంటూ..
ఉత్తరాది ప్రజలు ఎముకలు కొరికే చలితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 7- 8 డిగ్రీల మధ్యనే మధ్యనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉత్తరాది ప్రజలు ఎముకలు కొరికే చలితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 7- 8 డిగ్రీల మధ్యనే మధ్యనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేవలం టీ షర్ట్ ధరించి కనిపిస్తుండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర బ్రేక్ ఇచ్చిన రాహుల్.. మళ్లీ జనవరి 3 నుంచి మొదలు పెట్టనున్నారు. భారత్ జోడో యాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన రాహుల్.. సోమవారం టీ షర్ట్ ధరించి మహాత్మాగాంధీ సహా మాజీ ప్రధానుల స్మారకాల వద్ద నివాళులర్పించారు. దీనిపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గడ్డకట్టే చలిలో.. రాహుల్ టీషర్ట్ లో అలా ఎలా ఉంటున్నారని.. భారత్ జోడో యాత్రలో కూడా అలానే కనిపించారంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఢిల్లీ AICC ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి సైతం టీషర్ట్‌తోనే హాజరయ్యారు. దీంతో ఇవాళ కూడా మీరు టీ షర్ట్‌లోనే వచ్చారా అంటూ నేతలతో సహా అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు.
గడ్డ కట్టే చలిలో టీ షర్ట్‌లో అలా ఎలా ఉంటున్నారన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ బుధవారం ఫన్నీగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం టీ షర్ట్‌ల ట్రెండ్ నడుస్తోందని.. అది ఎప్పటివరకు ఉంటుందో అప్పటివరకు కొనగిస్తానంటూ రిప్లే ఇచ్చారు. సాధ్యమైనంత కాలం వరకు టీ షర్ట్‌ను ధరిస్తూనే ఉంటా.. అంటూ రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వీడియో..
#WATCH | Congress MP Rahul Gandhi replies to a question about him wearing a T-shirt.
Reporter to Rahul Gandhi: Today also in T-shirt…
Rahul Gandhi: T-shirt hi chal rahi hai aur jab tak chal rahi hai chalayenge… pic.twitter.com/S5OB4TuKfZ
— ANI (@ANI) December 28, 2022
కాగా, అంతకుముందు కూడా ఆయనకు ఇదే తరహాలో పలువురు ప్రశ్నరించగా.. చలికాలంలో వెచ్చటి దుస్తులు కూడా కొనుక్కోలేని రైతులు, కార్మికులు, పేద పిల్లలను ఈ మాట ఎందుకు అడగరని రాహుల్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాను 2,800 కి.మీ నడిచానని.. చలిలోనూ టీ-షర్ట్‌లో ఉండడం పెద్ద విషయమేమీ కాదంటూ పేర్కొన్నారు.
సోనియా.. రాహుల్..
ఇదిలాఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో రాహుల్ గాందీ తల్లి సోనియాతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. అమ్మ పక్కనే కూర్చొని చిన్న పిల్లాడిలా మారిపోయారు. అమ్మపై తన ప్రేమను చూపిస్తూ కనిపించారు. ప్రస్తుతం.. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#WATCH | Congress MP Rahul Gandhi had a joyful moment with his mother Sonia Gandhi during the party’s 138th Foundation Day celebration event in Delhi pic.twitter.com/tgqBAxY2co
— ANI (@ANI) December 28, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం..