AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DCP Weight Loss: డెడికేషన్‌ అంటే ఇలా ఉండాలి.. 8 నెలల్లో ఏకంగా 46 కేజీల బరువు తగ్గిన పోలీసధికారి

పోలీస్‌లు స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండటం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. ఐతే అధిక బరువున్న ఓ సీనియర్‌ పోలీసధికారి ఎనిమిది నెలల్లో ఏకంగా 46 కేజీల బరువు తగ్గి అందరినీ అబ్బురపరిచాడు..

DCP Weight Loss: డెడికేషన్‌ అంటే ఇలా ఉండాలి.. 8 నెలల్లో ఏకంగా 46 కేజీల బరువు తగ్గిన పోలీసధికారి
DCP weight loss
Srilakshmi C
|

Updated on: Dec 28, 2022 | 7:48 PM

Share

పోలీస్‌లు స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండటం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. ఐతే అధిక బరువున్న ఓ సీనియర్‌ పోలీసధికారి ఎనిమిది నెలల్లో ఏకంగా 46 కేజీల బరువు తగ్గి అందరినీ అబ్బురపరిచాడు. కఠినమైన ఆహార నియమాలు పాటించడం ద్వారా తన దేహ ఆకృతిని మార్చుకున్న ఈ పోలీసధికారిని అందరూ తెగ పొగిడేస్తున్నారు.

ఢిల్లీలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న జితేంద్ర మణికి పలు ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో అతను 130 కేజీల బరువుండేవాడు. షుగర్‌, బీపీ, కొలెస్ట్రాల్‌ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవాడు. వీటి నుంచి బయటపడాలని నిశ్చయించుకున్న డీసీపీ తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నాడు. దీనికోసం ప్రతిరోజూ 15,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేయడం ప్రారంభించాడు. బరువు తగ్గడానికి తాను ఎటువంటి మందులు వాడలేదని, రోటీలు, అన్నం వంటి అధిక కార్బోహైడ్రేట్ ఉండే ఆహారానికి బదులు సూప్‌లు, సలాడ్‌లు, పండ్ల వంటి పోషకాహారం క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. ఈ విధంగా కఠినమైన ఆహార అలవాట్ల మూలంగా కేవలం ఎనిమిది నెలల్లో తన నడుము చుట్టూ 12 అంగుళాల కొవ్వు తగ్గించుకున్నాడు. దీంతో అతని కొలెస్ట్రాల్‌లో ఐదవ వంతు తగ్గినట్లైంది.

ప్రతి నెలా నాలుగున్నర లక్షల అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ విధంగా గత 8 నెలల్లో దాదాపు 32 లక్షల అడుగులు నడిచినట్లు తెలిపాడు. ఫలితంగా ప్రస్తుతం 84 కిలోల బరువుకు చేరుకున్నట్లు ఆయన తెలిపాడు. తాజాగా 90,000 మందికి పైగా పోలీసులతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ప్రశంసించారు. డీసీపీ జితేంద్ర మణికి రివార్డును సైతం అందించారు. తాను బరువు తగ్గేందుకు నిరంతరం ప్రోత్సహించిన పైఅధికారులు, సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.