AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అమ్మ పేరు చెబితే కంటిలో చెమ్మ.. ఎంత కష్టపడి పెంచిందో కదా అమ్మ

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌ ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన అహ్మదాబాద్‌లోని మోహతా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది...

PM Modi: అమ్మ పేరు చెబితే కంటిలో చెమ్మ.. ఎంత కష్టపడి పెంచిందో కదా అమ్మ
Pm Modi Hiraben
Subhash Goud
|

Updated on: Dec 28, 2022 | 8:29 PM

Share

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌ ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన అహ్మదాబాద్‌లోని మోహతా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తల్లి ఆరోగ్య విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుని తల్లిని పరామర్శించారు. అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. అయితే మోడీ ఢిల్లీలో ఉన్నా.. తల్లి యోగక్షేమాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే అమ్మ పేరు చెబితే భావోద్వేగానికి లోనవుతారు ప్రధాని మోదీ. ఢిల్లీకి రాజైనా..తల్లికి బిడ్డే కదా! దేశాన్ని ఏలే ప్రధానే అయినా..అమ్మ ముందు పసివాడే కదా! ఓ సాధారణ మధ్యతరగతి బిడ్డ నరేంద్ర మోదీ.. అలాంటిది ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా దిగ్విజయంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి ఆయన ఈ స్థాయికి వచ్చారంటే.. ఆ తల్లి పెంపకం ఎంత గొప్పదో అర్థం కావట్లేదా. అందుకే హిరీ బెన్‌ ది గ్రేట్‌ అనుకుండా ఉండలేం.

హీరాబెన్‌..! దేశానికి హీరోలాంటి నాయకుడ్ని అందించిన తల్లి! గుజరాత్‌ ముఖ్యమంత్రి అయిన కొడుకును చూసి మురిసిపోయింది. ఎన్నికలు గెలిచి భారత ప్రధానిగా తిరిగివచ్చిన మోదీని చూసి ఉప్పొంగిపోయింది. కానీ ప్రధానికి తల్లి అయినా అదే సాదాసీదా జీవితం! గాంధీనగర్‌లో ఓ చిన్న గదిలో జీవిస్తున్న సమున్నత వ్యక్తిత్వం! అవును.. వందేళ్ల వయసులో కూడా హీరాబెన్‌ తన పనులు తాను చేసుకుంటూ గాంధీనగర్‌లో చిన్న ఇంట్లో జీవిస్తున్నారు. శతవసంతాల ఆత్మగౌరవ శిఖరం..! పిల్లల కోసం తపించే మాతృహృదయాలకు సంకేతం. బిడ్డల ఎదుగుదల కోసం ఎన్నో త్యాగాలు చేసింది. గుజరాత్‌లోని వద్‌నగర్‌లో హీరాబెన్‌ జీవితం మొదలైంది. దామోదర్‌దాస్‌ మూల్‌చంద్‌ మోదీతో ఆమెకు వివాహం అయింది. ఆరుగురు పిల్లలను పెంచడానికి ఆమె ఎంతో కష్టపడింది. ఆరుగురు పిల్లల్లో మూడో సంతానం నరేంద్రమోదీ. దేశానికే ప్రధాని.

మోదీ చిన్న వయసులోనే కుటుంబాన్ని విడిచారు. దేశ సేవకు జీవితాన్ని అంకితం చేశారు. దేశాన్నే తన కుటుంబంగా భావించారు. కానీ ప్రతి తల్లిలో హీరాబెన్‌ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది అమ్మ నేర్పిన సంస్కారం. జన్మనిచ్చిన తల్లి ఆరోగ్యం కోసం మోదీ మనసు తపిస్తూనే ఉంటుంది. ఆయనే కాదు.. హీరాబెన్‌ ఆరోగ్యం కోసం దేశమంతా ప్రార్థిస్తోంది.

ఇవి కూడా చదవండి

వందేళ్లు పూర్తి చేసుకున్న హీరాబెన్‌

కాగా, హీరాబెన్ వయస్సు 100 ఏళ్లు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఆమెకు కాళ్లు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. హీరా బెన్ గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు పంకజ్‌భాయ్‌తో కలిసి బృందావన్ బంగ్లాస్-2, రైసన్, గాంధీనగర్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం హీరాబెన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వయసు రీత్యా, ఆరోగ్యం విషమించడంతో బుధవారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..