Sukanya Samriddhi Yojana: పోస్టాఫీసు పథకాల్లో పొదుపు చేస్తున్నారా.. మీ బ్యాలెన్స్ ఎంత ఉందో సులభంగా ఇలా తెలుసుకోండి..

Sukanya Samriddhi Yojana: బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే గతంలో పాస్ బుక్ లో ప్రిటింగ్ వేయించుకుని లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకునేవారు. ఇప్పటికి కొంతమంది  తమ బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉందో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లి పాస్ బుక్ ప్రింటింగ్..

Sukanya Samriddhi Yojana: పోస్టాఫీసు పథకాల్లో పొదుపు చేస్తున్నారా.. మీ బ్యాలెన్స్ ఎంత ఉందో సులభంగా ఇలా తెలుసుకోండి..
Post Office Scheme
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 30, 2022 | 10:30 AM

Sukanya Samriddhi Yojana: బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే గతంలో పాస్ బుక్ లో ప్రిటింగ్ వేయించుకుని లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకునేవారు. ఇప్పటికి కొంతమంది  తమ బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉందో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లి పాస్ బుక్ ప్రింటింగ్ వేయించుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి సేవలను బ్యాంకులో ఏర్పాటు చేసిన లేదా..  బ్యాంకు ఈ కార్నర్ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల ద్వారా సెల్ఫ్ సర్వీసెస్ విధానంలో అందిస్తున్నారు . సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందటంతో బ్యాంకుకు వెళ్లకుండానే యాప్ లు లేదా, టోల్ ఫ్రీ నెంబర్లు, మెసెజ్ ల ద్వారా బ్యాలెన్స్ తో పాటు మరికొన్ని బ్యాంకింగ్ సేవలను పొందే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇవి బ్యాంకు ఖాతాదారుల సేవల వరకే పరిమితం. అయితే పోస్టాఫీసు, బ్యాంకుల్లో చాలా మంది సేవింగ్ స్కీమ్స్ లో పొదుపు చేసుకుంటారు. మరి మన సేవింగ్స్ స్కీమ్స్ లో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవాలంటే పాస్ బుక్ ప్రింట్ వేయించుకోవడం లేదా పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవల్సి వచ్చేది. కాని పోస్టాఫీసులు సైతం ఇ-పాస్‌బుక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టడంతో పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ కస్టమర్‌లు తమ ఖాతా సమాచారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ ప్రదేశం నుండి అయినా, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్ అవసరం లేకుండా తెలుసుకోవచ్చు. జాతీయ పొదుపు పథకాల ఖాతాదారులకు సరళీకృతమైన, మెరుగైన డిజిటల్ సౌకర్యాలను అందించడానికి ఈఏడాది అక్టోబర్ 12వ తేదీ నుంచి ఈ-పాస్‌బుక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఇ-పాస్‌బుక్ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి ఖాతాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్‌ ఉపయోగించవచ్చు. ఈ సేవ ఉచితంగా లభిస్తుంది. ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇ-పాస్‌బుక్ సదుపాయాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

బ్యాలెన్స్ విచారణ

వినియోగదారు ఈ ఎంపికను ఉపయోగించి ప్రతి నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా యొక్క బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు.

మినీ స్టేట్‌మెంట్

పొదుపు ఖాతాలు (పీఓఎస్ ఎ), సుకన్య సమృద్ధిఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ( పిపిఎఫ్ ) కోసం మినీ స్టేట్‌మెంట్‌లు మొదట అందుబాటులో ఉంచుతారు. ఆపై క్రమంగా ఇతర పథకాలకు అందుబాటులో ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇ-పాస్‌బుక్

పిపిఎఫ్, సేవింగ్ ఖాతా, సుకన్య సమృద్ధి ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసే విధానం www.indiapost.gov.in లేదా www.ippbonline.comలో అందించబడిన ఇ-పాస్‌బుక్ లింక్‌పై క్లిక్ చేయండి. లేదా నేరుగా ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అఫిషియల్ పేజీ ఓనెన్ అవుతుంది.

ఆ తరువాత మొబైల్ నంబర్‌ని నమోదు చేయాలి. అక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ OTPని సమర్పించాలి. ఆతర్వాత మన ఖాతాలో బ్యాలెన్స్ తదితర వివరాలు పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..