AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: ఇక ఎల్‌ఐసీలోనూ ఆరోగ్య బీమా, జనరల్‌ ఇన్స్యూరెన్స్.. త్వరలో ప్రారంభమయ్యే ఛాన్స్..

Life Insurance Corporation: ఎల్‌ఐసి పేరు చెప్తే గుర్తొచ్చేది జీవిత బీమా.. ప్రజలకు ఎన్నో ఆకర్షణీయమైన పథకాలను ఈ సంస్థ ముందుకు తీసుకువస్తోంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో.. చాలా మంది ఎల్‌ఐసి పాలసీ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎంత చెల్లించినా.. తమ నగదు భద్రం అనే ఉద్దేశంతో ఎల్‌ఐసి పాలసీ

LIC: ఇక ఎల్‌ఐసీలోనూ ఆరోగ్య బీమా, జనరల్‌ ఇన్స్యూరెన్స్.. త్వరలో ప్రారంభమయ్యే ఛాన్స్..
LIC
Amarnadh Daneti
|

Updated on: Dec 29, 2022 | 1:29 PM

Share

Life Insurance Corporation: ఎల్‌ఐసి పేరు చెప్తే గుర్తొచ్చేది జీవిత బీమా.. ప్రజలకు ఎన్నో ఆకర్షణీయమైన పథకాలను ఈ సంస్థ ముందుకు తీసుకువస్తోంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో.. చాలా మంది ఎల్‌ఐసి పాలసీ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎంత చెల్లించినా.. తమ నగదు భద్రం అనే ఉద్దేశంతో ఎల్‌ఐసి పాలసీ కడుతుంటారు. చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎల్‌ఐసి పాలసీ కలిగి ఉండటం సాధారణంగా చూస్తుంటాం. ఎంతో విశ్వసనీయమైన సంస్థగా ఉన్న ఎల్ఐసి త్వరలోనే ఆరోగ్య బీమా, సాధారణ బీమా పాలసీలను చేయనున్నట్లు తెలుస్తోంది. భీమా దిగ్గజం ఎల్ఐసి కాంపోజిట్ లైసెన్స్‌ పొందడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎల్‌ఐసి అన్ని రకాల బీమాలను చేసేది. అయితే ఒరియంటల్‌ ఇన్య్సూరెన్స్ కార్పోరేషన్ ప్రారంభించిన తర్వాత.. ఎల్ఐసి జీవిత బీమా పాలసీలను మాత్రమే అందిస్తోంది. తాజాగా హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో పాటు.. జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కూడా ఈ సంస్థ నుంచి పొందే అవకాశం కలగనుంది.

ఇప్పటికే జనరల్‌ ఇన్య్పూరెన్స్ కు సంబంధించి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అలాగే పలు ప్రయివేట్ సంస్థలు కూడా ఈ సేవలను అందిస్తున్నాయి. జనరల్‌ ఇన్స్యూరెన్స్‌కు సంబంధించి ఎక్కువ మంది ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బీమా కంపెనీల్లోనే బీమా చేస్తున్నప్పటికి.. వాటికి పోటీగా ప్రయివేట్ కంపెనీలు తక్కువ ప్రీమియం ధరలు, ఇతర ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

ఆరోగ్య బీమాకు సంబంధించి అనేక ప్రయివేటు బీమా కంపెనీలు ఆకర్షణీయమైన ప్రీమియంలతో పాలసీలు అందిస్తున్నాయి. ప్రస్తుతం హెల్త్ ఇన్య్సూరెన్స్ కు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఎల్‌ఐసి కూడా ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తే చాలా మంది జీవిత బీమా చేస్తున్న కస్టమర్లు.. ఇదే సంస్థలో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే అవకాశం ఉండొచ్చు. మరోవైపు కస్టమర్లును ఆకర్షించేందుకు జీవిత బీమాతో ప్రీమియంతో కలిసి హెల్త్ బీమాకు సంబంధించిన పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..