Rahul Gandhi: గత మూడేళ్లలో రాహుల్ గాంధీ ఎన్నిసార్లు భద్రతా నియమాలు ఉల్లంఘించారో తెలుసా.. క్లారిటీ ఇచ్చిన CRPF..

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరైన భద్రత ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ - సీఆర్పీఎప్‌ స్పష్టత ఇచ్చింది. రాహుల్‌ గాంధీ భద్రత విషయంలో ఎలాంటి లోపం లేదని, భద్రతా నియమాలు, మార్గదర్శకాలను..

Rahul Gandhi: గత మూడేళ్లలో రాహుల్ గాంధీ ఎన్నిసార్లు భద్రతా నియమాలు ఉల్లంఘించారో తెలుసా.. క్లారిటీ ఇచ్చిన CRPF..
Rahul Gandhi
Follow us

|

Updated on: Dec 29, 2022 | 12:06 PM

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరైన భద్రత ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ – సీఆర్పీఎప్‌ స్పష్టత ఇచ్చింది. రాహుల్‌ గాంధీ భద్రత విషయంలో ఎలాంటి లోపం లేదని, భద్రతా నియమాలు, మార్గదర్శకాలను రాహుల్ గాంధీ ఉల్లంఘించారని CRPF తెలిపింది. 2020 నుండి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని, ఈ విషయాన్ని ఆయనకు తెలియజేసినట్లు పేర్కొంది. రాహుల్ గాంధీ నిర్దేశించిన మార్గదర్శకాలను అనేక సందర్భాల్లో ఉల్లంఘించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు.. యాత్రలో పాల్గొనేవారికి సరైన భద్రత కల్పించడం లేదని, భద్రతా లోపాలపై చర్యలు తీసుకుని, అవసరమైన సెక్యూరిటీ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసింది. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ రాహుల్‌ గాంధీ భద్రతా ఏర్పాట్లపై స్పందించింది.

రాహుల్ గాంధీకి అవసరమైన మేరకు భద్రత కల్పించామని, ఆయన సందర్శనల సమయంలో రాష్ట్ర పోలీసులు, భద్రతా సంస్థల సమన్వయంతో CRPF అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించినప్పటి నుంచి.. తగినంత సిబ్బందితో భద్రత కల్పించామన్నారు. భద్రతా నియమాలు, మార్గదర్శకాలను పాటించినట్లు తెలిపారు.

2020 నుండి 113 సార్లు నిర్ధేశించిన మార్గదర్శకాలను రాహుల్ గాంధీ ఉల్లంఘించారని సీఆర్పీఎఫ్ తెలిపింది. అలాగే ఢిల్లీలో కూడా రాహుల్ భద్రతా మార్గదర్శకాలను పాటించలేదని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..