Fixed Deposits: ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు.. ఖాతాదారులకు ఆకర్షిస్తున్న ప్రముఖ బ్యాంకులు..

Fixed Deposits: భవిష్యత్తు అవసరాల కోసం పొదపు చేయాలనుకునే వారిలో ఎక్కువ మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు మక్కువ చూపిస్తారు. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇచ్చినా తమ నగదుకు సెక్యూరిటీ ఉంటుందనే అభిప్రాయంతో ఎక్కువ మంది బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయడానికి ఇష్టపడతారు. ఇటీవల..

Fixed Deposits: ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు.. ఖాతాదారులకు ఆకర్షిస్తున్న ప్రముఖ బ్యాంకులు..
Fixed Deposit
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 30, 2022 | 10:00 AM

Fixed Deposits: భవిష్యత్తు అవసరాల కోసం పొదపు చేయాలనుకునే వారిలో ఎక్కువ మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు మక్కువ చూపిస్తారు. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇచ్చినా తమ నగదుకు సెక్యూరిటీ ఉంటుందనే అభిప్రాయంతో ఎక్కువ మంది బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయడానికి ఇష్టపడతారు. ఇటీవల కాలంలో బ్యాంకుల మధ్య కూడా పోటీ పెరిగింది. దీంతో ఇతర బ్యాంకులతో తమ బ్యాంకులో ఎక్కువ వడ్డీ రేటు ఇస్తున్నామంటూ ప్రచారం కూడా చేస్తోంది. ఎక్కువ వడ్డీ పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వరుసగా రెపో రేటు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇటీవల పెంచిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఓబి), హెచ్ డిఎఫ్ సి, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి. వీటిలో ప్రధానమైన బ్యాంకులు ఏలాంటి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకుందాం.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంకు ఆఫ్ బరోడా సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందిస్తోంది. సాధారణ ప్రజలకు కనీసం 3శాతం, గరిష్టంగా 7.05 శాతం వడ్డీ రేట్లను అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు కనిష్టంగా 3.5 గరిష్టంగా 7.55 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఓబి) 399 రోజుల బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది.   444 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ రేటు, 555 రోజుల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.75, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీ అందిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ ఇండియా (బివోఐ) అధిక వడ్డీ రేట్లను అందించే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌తో ముందుకు వచ్చింది. ‘స్టార్ సూపర్ ట్రిపుల్ సెవెన్ ఫిక్స్‌డ్ డిపాజిట్’ పథకాన్ని ప్రకటించింది, ఇది పరిమిత కాల ఆఫర్ కాగా, పేరుకు తగినట్లుగా కొత్తగా ప్రారంభించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కాలవ్యవధి 777 రోజులు. మామూలు ఖాతాదారులకు డిపాజిట్‌పై 7.25% సీనియర్ సిటిజన్‌లకు 7.75% వరకు వడ్డీ రేటును ఈ బ్యాంకు అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ 666 రోజుల కాలవ్యవధి కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ప్రకారం, బ్యాంకు తన ఖాతాదార్లకు 7% వడ్డీ రేటును అందిస్తోంది, సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 7.5% వడ్డీ పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..