Moto G13: 50ఎంపీ కెమెరాతో అదరగొట్టిన మోటోరోలా.. డాల్బీ స్పీకర్లతో సెన్సేషన్.. ధర రూ. 10వేల లోపే..

అద్భుతమైన ఫీచర్లతో కేవలం రూ. 10,000ల లోపు ధరలోనే మోటోరోలా ఇండియా నుంచి ఓ సరికొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. మోటో జీ సిరీస్ లో భాగంగా మోటో జీ 13 పేరిట కంపెనీ దీనిని విడుదల చేసింది.

Moto G13: 50ఎంపీ కెమెరాతో అదరగొట్టిన మోటోరోలా.. డాల్బీ స్పీకర్లతో సెన్సేషన్.. ధర రూ. 10వేల లోపే..
Moto G13 4g
Follow us
Madhu

|

Updated on: Mar 30, 2023 | 1:00 PM

మీరు తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్. అద్భుతమైన ఫీచర్లతో కేవలం రూ. 10,000 ల లోపు ధరలోనే మోటోరోలా ఇండియా నుంచి ఓ సరికొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. మోటో జీ సిరీస్ లో భాగంగా మోటో జీ 13 పేరిట కంపెనీ దీనిని విడుదల చేసింది. 4జీ వేరియంట్లో 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఇది వస్తోంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍ను ఈ మొబైల్ కలిగి ఉంది. హెచ్‍డీ+ డిస్‍ప్లే, మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో వస్తోంది. ప్రస్తుత మార్కెట్లో రూ. 10,000 లోపు ఉన్న పలు బ్రాండ్లకు ఇది సవాలు విసరగలుతుంది. ఈ నేపథ్యంలో మోటో జీ13 మొబైల్ ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్లు వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 ధర, సేల్..

మోటో జీ13 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో బుధవారం(మార్చి 29న) లాంచ్ అయింది. 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ ధర రూ.9,499 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.9,999. ఏప్రిల్ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్ , మోటోరోలా ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లో సేల్ ప్రారంభం కానుంది. మ్యాటీ చార్‌కోల్, లావెండర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఇది అందుబాటులో ఉండనుంది.

 స్పెసిఫికేషన్లు ఇవి..

ఈ ఫోన్ లో 6.5 హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లే ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 8.19 మిల్లీమీటర్ల మందం, 184 గ్రాముల బరువు ఉంది మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. టెక్నో స్పార్క్ 8 ప్రో, రెడ్‌మీ నోట్ 9, రియల్‌మీ నార్జో 50ఏ లాంటి మోడల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. మెమొరీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్ ఉండదు. ఆండ్రాయిడ్ 14 అప్‍డేట్‍ను కూడా ఈ మొబైల్ అందుకుంటుందని మోటో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

అత్యాధునిక ఫీచర్లు..

మోటో జీ13 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో నైట్ విజన్ మోడ్, పోర్ట్‌రైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ సిమ్ కార్డ్ స్లాట్స్, డాల్బీ అట్మాస్‌తో డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, థింక్‌షీల్డ్ ప్రొటెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!