Spam Calls: స్పామ్ కాల్స్‪తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ తలనొప్పి ఇక ఉండదు.. సింపుల్ టిప్స్..

వాస్తవానికి ఎక్కువ స్పామ్‌ కాల్స్‌లో  వినియోగదారులను మోసం చేసేవే ఉంటాయి. కాల్స్‌ చేస్తూ యూజర్లను తప్పు దారి పట్టిస్తుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత లోన్స్‌ ఇప్పిస్తాము, జాబ్‌ ఆఫర్స్‌ ఉన్నాయి అంటూ రకరకాలుగా ప్రజలను మభ్యపెడుతుంటారు.

Spam Calls: స్పామ్ కాల్స్‪తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ తలనొప్పి ఇక ఉండదు.. సింపుల్ టిప్స్..
Spam Calls
Follow us

|

Updated on: Feb 23, 2023 | 3:00 PM

మీరు సీరియస్ గా వర్క్ లో ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. ఆ సమయానికి ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంటుంది. చేస్తున్న పనిని ఆపేసి, వెళ్లి ఏదో అర్జంట్ కాల్ అనుకొని లిఫ్ట్ చేస్తే అది టెలీ మార్కెటింగ్ కాల్ అయివుంటుంది. ఆ సందర్భంలో విపరీతమైన కోపం, చిరాకు వస్తుంది. ఇటు వంటి ఫోన్ కాల్స్ ఆపడానికి కుదరకపోకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గత కొన్ని సంవత్సరాలుగా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ఇబ్బందికరమైన టెలిమార్కెటింగ్ కాల్‌లు మరియు సందేశాల సమస్య అలాగే ఉంది. వాస్తవానికి ఎక్కువ స్పామ్‌ కాల్స్‌లో  వినియోగదారులను మోసం చేసేవే ఉంటాయి. కాల్స్‌ చేస్తూ యూజర్లను తప్పు దారి పట్టిస్తుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత లోన్స్‌ ఇప్పిస్తాము, జాబ్‌ ఆఫర్స్‌ ఉన్నాయి అంటూ రకరకాలుగా ప్రజలను మభ్యపరుస్తుంటారు. అయితే ఇలాంటి కాల్స్‌ రాకుండా ఉండడానికి అన్ని టెలికాం సంస్థలు డీఎన్డీ(DND) ఆప్షన్ ఇచ్చాయి. దీనిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఓ సారి చూద్దాం..

  • మీ ఫోన్‌లో డిఫాల్ట్ మెసేజింగ్ యాప్‌ని తెరవండి.
  • కొత్త మెసేజ్ టైప్ చేయండి.
  • FULLY BLOCK అని కేపిటల్ లెటర్స్ లో టైప్ చేసి, టోల్ ఫ్రీ నంబర్ 1909కి పంపండి.
  • ఇది మీ టెలీమార్కెటింగ్ కు సంబంధించిన స్పామ్ కాల్స్, మెసేజ్ రాకుండా చేస్తుంది.

అలాగే ఇంకా కొన్ని కోడ్లను వినియోగించి మిగిలిన స్పామ్ కాల్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం..

  • అన్ని స్పామ్ కాల్స్, మెసేజ్ లను బ్లాక్ చేయడానికి FULLY BLOCK అని టైప్ చేసి మెసేజ్ పంపాలి.
  • బ్యాంకింగ్, ఇన్యూరెన్స్, క్రెడిట్ కార్డు, ఆర్థికపరమైన ఉత్పత్తులకు సంబంధించిన ప్రోమోషనల్ మెసేజ్ లు కాల్స్ ను బ్లాక్ చేయడానికి BLOCK 1 అని టైప్ చేయాలి.
  • రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కాల్స్ రాకుండా ఉండాలంటే BLOCK 2 అని టైప్ చేయాలి. విద్యాపరమైన స్పామ్ కాల్స్ ను నిరోధించడానికి BLOCK 3, హెల్త్ విషయమైన కాల్స్ ని బ్లాక్ చేయడానికి BLOCK 4, ఆటోమొబైల్, ఐటీ, వినోదానికి సంబంధించిన ప్రోమోషల్ కాల్స్ నిరోధించడానికి BLOCK 5 అని టైప్ చేసి మెసే్ పంపాలి.
  • అలాగే బ్రాడ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ వంటి వాటిపై BLOCK 6 అని, టూరిజమ్, బెవరేజెస్ వంటి వాటిని బ్లాక్ చేయడానికి BLOCK 8 అని టైప్ చేసి 1909 నంబర్ కి మెసేజ్ చేయాలి.

వివిధ యాప్ లను వినియోగించి..

టెలికాం ఆపరేటర్ల యాప్ ల ద్వారా కూడా డీఎన్డీ ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం.. జీయో వినియోగదారులు.. మై జీయో యాప్ ఓపెన్ చేయాలి. దానిలో మెనూ లోకి వెళ్లి, ప్రోఫైల్, అథర్ సెట్టింగ్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో డూ నాట్ డిస్టర్బ్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రిఫరెన్స్ సెట్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ కొట్టాలి. ఇక మార్కెటింగ్ కాల్స్, మెసేజెస్ అన్నీ బ్లాక్ అయిపోతాయి.

ఇవి కూడా చదవండి

ఎయిర్ టెల్ యాప్ లో .. ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేసి కింద మోర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దానిలో మేనేజ్ సర్వీసెస్ సెక్షన్ ని సెలెక్ట్ చేయాలి. దానిలో యాక్టివేట్/డీ యాక్టవేట్ డీఎన్డీ పై క్లిక్ చేయాలి. దానిలో స్పామ్ కేటగిరీలు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి.

వోడాఫోన్ ఐడియా యాప్ లో.. విఐ యాప్ ని ఓపెన్ చేయాలి. దానిలో మై అకౌంట్ పై క్లిక్ చేసి, మోర్ సర్వీసెస్ లోకి వెళ్లాలి. అక్కడ డూ నాట్ డిస్టర్బ్(డీఎన్డీ) ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని దానిలోని ప్రిఫరెన్స్ ని సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం యాక్టివేట్ బటన్ ప్రెస్ చేయాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..