- Telugu News Photo Gallery Technology photos Oppo launching new flip smart phone india Oppo find n2 flip features and price details Telugu Tech News
OPPO Find N2 Flip: బాప్‌రే ఏం ఫోన్ గురూ.! పేపర్‌ను మడతపెట్టినట్లు పెట్టేయొచ్చు. స్టన్నింగ్ ఫీచర్స్..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను స్టన్నింగ్ లుక్‌లో డిజైన్ చేశారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Feb 23, 2023 | 1:46 PM

ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్‌లకు డిమాండ్ పెరగుతోంది. కంపెనీలు సైతం ఇలాంటి ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. సామ్‌సంగ్ మొదలు దాదాపు అన్ని బడా కంపెనీలు మడతపెట్టే ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒప్పో సైతం తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొస్తోంది.

ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌లో ఇప్పటి వరకు లేని విధంగా 3.26 ఇంచెస్ కవర్ డిస్‌ప్లేను అందించారు. ఫ్లిప్ ఫోన్‌లో ఇంత పెద్ద డిస్‌ప్లేను తీసుకురావడం ఇదే తొలిసారి. 191 గ్రాముల బరువుండే ఈ ఫోన్ ఫ్లిప్ ఓపెన్ చేసినప్పుడు 7.45 ఎమ్‌ఎమ్ మందంతో ఉంటుంది.

ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందించారు. సోనీ ఐఎమ్‌ఎక్స్890 సెన్సర్ కెమెరాను ఇచ్చారు. కవర్ డిస్‌ప్లేలోనే వైఫై, మొబైల్ డేటా, ఫ్లైట్ మోడ్, బ్లూటూత్, నోటిఫికేషన్ అలర్ట్స్, పవర్ సేవింగ్ మోడ్ వంటివి ఆపరేట్ చేసుకోవచ్చు.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను టెస్టింగ్‌లో భాగంగా 4 లక్షలసార్లు ఫ్లిప్ ఓపెన్, క్లోజ్ చేశారు. అంటే పదేళ్లపాటు రోజుకు 100 సార్లు స్మార్ట్ ఫోన్‌ను ఓపెన్, క్లోజ్ చేసిన దాంతో సమానమన్నమాట. -20 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 50 డిగ్రీల సెంటిగ్రేడ్ లాంటి కండిషన్స్‌లోనూ ఈ ఫోన్ పనిచేసేలా రూపొందించారు.

బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 4300 ఎమ్‌ఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌లో 44 వాట్స్‌తో కూడిన సూపర్‌వూక్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించారు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 42 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.





























