Tech News: త్వరలో 240వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీ.. ప్రకటించిన రియల్‌మీ..

Weibo పోస్ట్ ప్రకారం రియల్ మీ తన లీప్‌ఫ్రాగ్ టెక్నాలజీని ప్రదర్శించడానికి జనవరి 05 న చైనాలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది.

Tech News: త్వరలో 240వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీ.. ప్రకటించిన రియల్‌మీ..
Realme 240 Charging
Follow us
Venkata Chari

|

Updated on: Dec 28, 2022 | 6:33 AM

ప్రముఖ మొబైల్ కంపెనీ తన GT నియో 5తో పాటుగా 240W ఛార్జింగ్‌ టెక్నాలజీని పరిచయం చేసేందుకు సిద్ధమైందంట. కొంతకాలంగా వార్తల్లో ఉన్న ఈ ఊహాగానాలను నిజం చేయనుందని భావిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, చైనీస్ టెక్నాలజీ దిగ్గజం జనవరి 05, 2023న దాని లీప్‌ఫ్రాగ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేస్తుందని తెలుస్తోంది. Weibo పోస్ట్ ప్రకారం, రియల్‌మీ తన లీప్‌ఫ్రాగ్ టెక్నాలజీని ప్రదర్శించడానికి జనవరి 05 న చైనాలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది Realme GT నియో 5 తో పాటు 240W ఛార్జింగ్ కావచ్చని అనుకుంటున్నారు.

ఈ టెక్నాలజీ దిగ్గజం Realme GT Neo 5 కోసం 150W, 240W తో రెండు వేరియంట్‌లను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇవి వరుసగా 5,00mAh, 4600mAh బ్యాటరీలను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, Realme 10ని భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన తాజా నంబర్ సిరీస్‌ను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ట్విట్టర్‌లో ఒక ప్రకటన చేసింది. రియల్‌మీ 10 మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా వస్తుందని భావిస్తున్నారు.

Realme 10 భారతదేశంలో విడుదల కానుందని రియల్‌మీ ఇండియా ట్వీట్ చేసింది. అయితే, ఈ ట్వీట్‌లో లాంచ్ తేదీని వెల్లడించలేదు. అంతేకాకుండా రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం దాని అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక పేజీని ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

Realme 10 5G ఇప్పుడు చైనాలో లభిస్తుంది. గ్లోబల్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 6.6-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేతో అమర్చారు. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ రిజిన్ డౌజిన్, స్టోన్ క్రిస్టల్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

Realme 10 5G అనేది మిడ్-బడ్జెట్ కేటగిరీ ఫోన్. ఇది రెండు మోడళ్లలో లభిస్తుంది. బేస్ మోడల్ 8GB RAMని 128GB స్టోరేజ్‌తో ప్యాక్ చేస్తుంది. దీని ధర CNY 1,299, అంటే సుమారుగా రూ. 14,700గా ఉంది. మరో మోడల్ 8GB RAM, 256GB స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. ఇది CNY 1,599 ధర ట్యాగ్‌ను కలిగి ఉంది (సుమారుగా రూ. 18,000).

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..