Best affordable smartphones: రూ. 8,000లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. టాప్ బ్రాండ్లు.. అదిరిపోయే ఫీచర్లు..

చిన్న చిన్న ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకొనే వారు తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కావాలని ఎదురుచూస్తుంటారు. మీరు అదే విధంగా ఆలోచిస్తుంటే.. ఇదిగో ఈ కథనం మీ కోసమే. అత్యంత చవకైన 4జీ స్మార్ట్ మొబైళ్లను మీకు అందిస్తున్నాం.

Best affordable smartphones: రూ. 8,000లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. టాప్ బ్రాండ్లు.. అదిరిపోయే ఫీచర్లు..
Smart Phones Under 8000
Follow us

|

Updated on: Feb 23, 2023 | 1:50 PM

స్మార్ట్ ఫోన్ మనిషికి ఓ నిత్యావసరం అయిపోయింది. అది చేతిలో లేకుండా మనిషి అడుగు ముందుకేయలేని పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో అత్యాధునిక ఫీచర్లు, అత్యుత్తమ ఫీచర్లతో పలు దిగ్గజ కంపెనీల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ధర కూడా అంతే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ లెవెల్ లో స్మార్ట్ ఫోన్ కావాలంటే ఏం చేయాలి? చిన్న చిన్న ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకొనే వారు తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కావాలని ఎదురుచూస్తుంటారు. మీరు అదే విధంగా ఆలోచిస్తుంటే.. ఇదిగో ఈ కథనం మీ కోసమే. అత్యంత చవకైన 4జీ స్మార్ట్ మొబైళ్లను మీకు అందిస్తున్నాం. కేవలం రూ. 8000లలోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవి.. ఓ లుక్కేయండి..

మోటో ఈ13(Moto E13)..

ఈ ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్‌తో కేవలం రూ.7,999కే వస్తుంది . ఇది ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీనిలో Unisoc T606 ప్రాసెసర్ ఉంటుంది. వాటర్-డ్రాప్ నాచ్‌తో 6.5-అంగుళాల హెచ్ డీ స్క్రీన్‌తో వస్తుంది. యూఎస్బీ టైప్-సి పోర్ట్ ద్వారా 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ అనుకూలిస్తుంది. దీనిలో బ్యాటరీ 5,000 mAh సామర్థ్యం కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ52 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది, ఇది స్ప్లాష్-రెసిస్టెంట్‌గా ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఆడియోతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ దేశంలోనే అత్యంత సరసమైనది. ఎంట్రీ-లెవల్ హార్డ్‌వేర్ కోసం మెరుగైన ఆప్టిమైజేషన్‌తో ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్13 జీఓ ఎడిషన్‌తో వస్తోంది.

శామ్సంగ్ గేలాక్సీ ఏ03(Samsung Galaxy A03)..

మీరు శామ్సంగ్ నుండి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే గేలాక్సీ ఏ03 బెస్ట్ ఆప్షన్. ఇది అమెజాన్‌లో రూ. 7,950కి అందుబాటులో ఉంది. 3GB RAM, 32GB స్టోరేజ్‌తో వస్తుంది. Unisoc Tiger T606 soc ప్రాసెసర్ ఉంది. 6.5-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీనిలోని బ్యాటరీ 5,000 mAh సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో అత్యంత ఆకర్షణీయ అంశం ఏంటంటే f/1.8 ఎపర్చర్‌తో కూడిన 48MP ప్రైమరీ కెమెరా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టెక్నో స్పార్క్ 9(Tecno Spark 9)..

4GB RAM,64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉన్న టెక్నో స్పార్క్ 9 కూడా రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఇది పరికరం మీడియా టెక్ హీలియో జీ 37 ఎస్ఓసీ పై ఆధారపడి పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఆధారపడి పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ తో పాటు 5,000 mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.

రెడ్మీ 10ఏ(Redmi 10A)..

రెడ్మీ 10ఏ స్మార్ట్ ఫోన్ క్రోమాలో రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఇది మనదేశంలో లభ్యమయ్యే రూ. 8,000 లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఇది 4G నెట్‌వర్క్‌కు మద్దతుతో 3GB RAM, 32GB స్టోరేజ్ ను కలిగి ఉంది. మీడియా టెక్ హీలియో జీ 25 ప్రాసెసర్‌ ఉంటుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మల్టీ-కెమెరా సిస్టమ్ అందుబాటులో ఉంది. 5,000 mAh బ్యాటరీ ఉంది. ఫోన్ బాడీ ప్లాస్టిక్‌ని ఉపయోగించి తయారు చేశారు. 6.53-అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

రియల్ మీ నార్జో 50ఐ ప్రైమ్(realme narzo 50i Prime)..

రియల్‌మే నార్జో 50ఐ ప్రైమ్ రూ. 8,000లోపు ధరలో మరో అద్భుతమైన ఎంపిక. 7,999 రిటైల్ ధర ట్యాగ్‌తో వస్తున్న ఈ ఫోన్ 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది Unisoc T612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 8MP, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. వాటర్-డ్రాప్ స్టైల్ నాచ్‌తో 6.5-అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ ట్రెండీగా కనిపిస్తుంది.

నోకియా సీ20 ప్లస్..

నోకియా సీ20 ప్లస్ ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్‌లో కేవలం రూ.7,999కే లభిస్తోంది. ఈ పరికరం 2GB RAM, 32GB స్టోరేజ్ ని అందిస్తోంది. బ్లోట్‌వేర్ లేదా థర్డ్-పార్టీ యాప్‌లు లేకుండా Unisoc SC9863A ప్రాసెసర్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో ఇది పనిచేస్తుంది. 8MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ ఉంటుంది. 4,950 mAh బ్యాటరీ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles