Tata Cars: టాటా కార్లపై అదిరే ఆఫర్లు.. రూ. 85,000 వరకూ తగ్గింపు.. అవకాశం వదులుకోవద్దు..
మీరు ఓ కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. దేశీయ టాప్ బ్రాండ్ అయిన టాటా మోటార్స్ ఈ సెప్టెంబర్ లో అదిరే ఆఫర్లను పలు మోడళ్ల కార్లపై అందిస్తోంది. ముఖ్యంగా ఎస్‌యూవీ కారు కొనాలనుకొనే వారికి ఈ ఆఫర్లు బాగా ఉపయోగపడతాయి. టాటాలోని ఎస్‌యూవీ ఫ్లాగ్ షిప్ లైన టాటా హారియర్, టాటా సఫారీలతో పాటు టాటా టియోగో, టాటా టైగోర్, అల్ట్రోజ్, నెక్సాన్ లపై కూడా పలు ఆఫర్లను అందిస్తున్నారు.
మీరు ఓ కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. దేశీయ టాప్ బ్రాండ్ అయిన టాటా మోటార్స్ ఈ సెప్టెంబర్ లో అదిరే ఆఫర్లను పలు మోడళ్ల కార్లపై అందిస్తోంది. ముఖ్యంగా ఎస్‌యూవీ కారు కొనాలనుకొనే వారికి ఈ ఆఫర్లు బాగా ఉపయోగపడతాయి. టాటాలోని ఎస్‌యూవీ ఫ్లాగ్ షిప్ లైన టాటా హారియర్, టాటా సఫారీలతో పాటు టాటా టియోగో, టాటా టైగోర్, అల్ట్రోజ్, నెక్సాన్ లపై కూడా పలు ఆఫర్లను అందిస్తున్నారు. అయితే టాటా పంచ్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్లపై ఎటువంటి ఆఫర్లు లేవు. ఈ సెప్టెంబర్ చివరి వరకూ ఈ ఆఫర్లు కొనసాగుతాయని కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
టాటా టియాగో/టాటా టైగోర్.. ఈ రెండు సీఎన్జీ వేరియంట్లపై టాటా కంపెనీ రూ. 30,000 వరకూ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇవి కాక రూ. 20,000 పాత కారు ఎక్స్ చేంజ్ పై తగ్గింపు అందిస్తాయి. అంతేకాక కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3,000 వరకూ ఉంటుంది. మొత్తంగా సీఎన్జీ వేరియంట్ సింగిల్ సిలెండర్ కారుపై రూ. 53,000, ట్విన్ సిలెండ్ సీఎన్జీ వేరియంట్ పై రూ. 23,000, పెట్రోల్ వేరియంట్ పై రూ. 3,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. టాటా టియాగో అసలు ధర రూ. 5.60 లక్షల నుంచి రూ. 8.20లక్షల వరకూ ఉంటుంది. అలాగే టాటా టైగోర్ రూ. 6.30లక్షల నుంచి రూ. 8.95లక్షల వరకూ ఉంటుంది.
టాటా అల్ట్రోజ్.. పెట్రోల్ ఆటోమేటిక్, అన్ని డీజిల్ వేరియంట్లపై అధిక డిస్కౌంట్ పొందొచ్చు. గరిష్టంగా రూ. 30,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. దీనిలో క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000 కాగా, పాత కారు ఎక్స్ చేంజ్ పై రూ. 10,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 వరకూ ఉంటుంది. దీనిలో సీఎన్జీ వేరియంట్ పై ఎటువంటి డిస్కౌంట్లు లేవు. ఈ టాటా అల్ట్రోజ్ అసలు ధర రూ. 6.60లక్షల నుంచి రూ. 10.74లక్షల వరకూ ఉంటుంది.
టాటా హారియర్/టాటా సఫారీ.. అడాస్ కలిగి ఉన్న వేరియంట్లపై అధిక ప్రయోజనాలను మీరు పొందొచ్చు. నాన్ అడాస్ వేరియంట్లలో ఈ ఆఫర్లు లేవు. ఈ రెండు మోడళ్లకు చెందిన అడాస్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 85,000 వరకూ వివిధ రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 50,000, పాత కారు ఎక్స్ చేంజ్ పై రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 10,000 వరకూ పొందొచ్చు. నాన్ అడాస్ మోడళ్లపై మాత్రం ఎక్స్ చేంజ్ బోనస్ రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 10,000 మొత్తం కలిపి రూ. 35,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. టాటా హారియర్ ధర రూ. 15.20లక్షల నుంచి రూ. 24.27లక్షల వరకూ ఉంటుంది. అలాగా టాటా సఫారీ కారు రూ. 15.85లక్షల నుంచి 25.21లక్షల వరకూ ఉంటుంది.
టాటా నెక్సాన్.. మిగిలిన మోడళ్ల మాదిరి కాకుండా ఈ కారుపై కేవలం కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే రూ. 5,000 వరకూ లభిస్తోంది. ఈ నెక్సాన్ కారు ఇటీవల సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. నెక్సాన్ 2023 ధర రూ. 8.10లక్షల నుంచి రూ. 15.50లక్షల వరకూ ఉంటుంది.
ఇవి గుర్తుంచుకోండి..
ఈ కార్లపై అందిస్తున్న కార్పొరేట్ ఆఫర్లు మారుతుంటాయి. స్థానిక డీలర్ల ను బట్టి వీటిల్లో మార్పులుండొచ్చు. అలాగే మీరు నివసిస్తున్న రాష్ట్రం, నగరాన్ని బట్టి కూడా రేట్లతో పాటు ఆఫర్లలలోనూ తేడాలుంటాయి. మీకు ఇప్పుడు అందించిన రేట్లన్నీ ఢిల్లీ ఎక్స్ షోరూం ధరలు. మీకు మరింత సమాచారం కావాలంటే మీ దగ్గరలోని టాటా డీలర్ ను సంప్రదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..