QR Code Scanning: నకిలీ కోడ్‌లతో నట్టేట ముంచుతారు! ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వినియోగదారులూ బీ అలర్ట్!
కేవలం ఓ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, మన పెట్టుకున్న పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే చాలు సెకండ్లలోనే లావాదేవీ పూర్తయ్యిపోతోంది. అయితే ఈ విధానంలో ఎంత సౌలభ్యం ఉందో అంతే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నకిలీ క్యూఆర్ కోడ్లతో మిమ్మిల్ని బురిడీ కొట్టించే అవకాశం లేకపోలేదని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూఆర్ కోడ్లు, నకిలీవా లేక అసలువా తెలుసుకోవడం ఎలా? పూర్తి వివరాలు ఇవి..
బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజ్ అవుతోంది. మిగిలిన అన్ని రంగాలతో పోల్చితే ఇది చాలా వేగంగా మార్పు చెందుతోంది. ఇప్పటికే చాలా వరకూ ఆన్లైన్, యూపీఐ ఆధారిత లావాదేవీలకు అలవాటు అయిపోయారు. క్యాష్ లెస్ పేమెంట్లను ఎక్కువగా చేస్తున్నారు. చేతిలో డబ్బులు ఉండాలని అనే ఆలోచన కూడా ఎవరికీ ఉండటం లేదు. చేతిలో మొబైల్ ఫోన్ ఉండి. ఫోన్ నంబర్కు అకౌంట్ నంబర్ అనుసంధానమే ఉంటే చాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు జరిగే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ల సాయంతో చాలా సులువుగా లావాదేవీలు జరిగిపోతున్నాయి. కేవలం ఓ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, మన పెట్టుకున్న పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే చాలు సెకండ్లలోనే లావాదేవీ పూర్తయ్యిపోతోంది. అయితే ఈ విధానంలో ఎంత సౌలభ్యం ఉందో అంతే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నకిలీ క్యూఆర్ కోడ్లతో మిమ్మిల్ని బురిడీ కొట్టించే అవకాశం లేకపోలేదని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూఆర్ కోడ్లు, నకిలీవా లేక అసలువా తెలుసుకోవడం ఎలా? పూర్తి వివరాలు ఇవి..
క్యూఆర్ కోడ్ అంటే..
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన పలు యాప్ ల సాయంతో చాలా సులువుగా ఆర్థిక లావాదేవీలు చేసేయగలుగుతున్నాం. ఫోన్ నుంచి క్యూర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా సులువుగా ఇది జరిగిపోతుంది. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ అని అర్థం. అంటే ఎవరికైతే డబ్బులు పంపాలని భావిస్తే వారి ఖాతా వివరాలు ప్రత్యేకంగా తయారు చేసిన కోడ్ లో నిక్షిప్తమై ఉంటాయి. దానిని స్కాన్ చేసి ఎవరికి డబ్బు పంపాలన్నా పంపేయొచ్చు. అయితే ఇటీవల కాలంలో నకిలీ క్యూఆర్ కోడ్‌లు కూడా పుట్టుకొస్తున్నాయి, అనేక మోసాల కేసులు తెరపైకి వస్తున్నాయి.
మీరు ఫేక్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే, మీరు అనేక సమస్యలతో చిక్కుకోవచ్చు. మీ వ్యక్తిగత డేటా దొంగిలించబడే అవకాశం ఉంది. కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు స్కామర్‌లు మిమ్మల్ని తీసుకెళ్లవచ్చు. వాస్తవానికి, మీరు మీ పేరు, సంప్రదింపు నంబర్లు, చిరునామా, బ్యాంక్ వివరాలు వంటి సమాచారాన్ని అందిస్తే, మోసగాళ్లు మీ గుర్తింపును దొంగిలించే అవకాశం ఉంది. అదనంగా, ట్రోజన్లు, మాల్వేర్, ర్యాన్ సమ్ వేర్ వంటి హానికరమైన సాఫ్ట్‌వేర్‌లు, నకిలీ క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి మీ పరికరంలోకి డౌన్‌లోడ్ అవుతాయి. ఈ వైరస్‌లు మీపై నిఘా పెట్టగలవు. అంతేకాక మీ ప్రైవేట్ డేటాను దొంగిలించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే మీరు నకిలీ క్యూఆర్ కోడ్‌లను సులభంగా గుర్తించవచ్చు. అదెలాగో ఎప్పుడు చూద్దాం..
నకిలీ క్యూఆర్ కోడ్ ను ఇలా గుర్తించండి..
- ఏదైనా దుకాణం లేదా రెస్టారెంట్‌లో క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసే ముందు కోడ్ ఆకృతిపై చాలా శ్రద్ధ వహించండి. ఆకారం వక్రీకరించబడిందని లేదా కోడ్‌ని ఏదైనా ఒకదానిపై అతికించబడిందని మీరు భావిస్తే, క్యూఆర్ కోడ్‌పై చెల్లించకుండా ఉండండి, బదులుగా నగదు రూపంలో చెల్లించడాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆకారం మారిన క్యూఆర్ కోడ్ నకిలీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- మీరు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆ వ్యాపారి లేదా దుకాణం పేరును తనిఖీ చేయండి. డబ్బు ఏ పేరుతో బదిలీ చేయబడుతుందని దుకాణదారుని అడగండి. అదే పేరు మీ మొబైల్ స్క్రీన్‌పై కనబడితే మాత్రమే చెల్లింపును కొనసాగించండి. దుకాణం లేదా విక్రేత పేరు సరిపోలకపోతే జాగ్రత్తగా ఉండండి.
- మీ ఈ-మెయిల్ ఐడీలలో లేదా జంక్ మెయిల్ ద్వారా మీరు స్వీకరించే ఏ క్యూఆర్ కోడ్‌ను ఎప్పుడూ స్కాన్ చేయవద్దు. మీరు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, యూపీఐ పిన్‌ను నమోదు చేస్తే, మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..