e-PAN: అర్జెంటుగా పాన్ కార్డు కావాలా? ఈ-పాన్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
అత్యవసర పరిస్థితుల్లో పాన్ కార్డు మీకు కనిపించకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బందులు తప్పవు. అయితే మీకో ఆప్షన్ ఉంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం వినియోగదారులకు ఈ అవకాశం కల్పిస్తోంది.
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)ఫైల్ చేయడానికి డెడ్ లైన్ దగ్గరపడుతోంది. ప్రతి ఉద్యోగి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకొనే పనిలో నిమగ్నమై ఉన్నారు. వీటిల్లో ప్రధానంగా ఆధార్, పాన్ కార్డులు తప్పనిసరి. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో పాన్ కార్డు మీకు కనిపించకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బందులు తప్పవు. అయితే మీకో ఆప్షన్ ఉంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం వినియోగదారులకు ఈ అవకాశం కల్పిస్తోంది. ఇది మీకు అత్యవసరమైన సమయంలో బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ పాన్ కార్డు పోయినా ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ-పాన్ డౌన్ లోడ్ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం..
ఈ-పాన్ ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి..
- ఈ-పాన్ డౌన్ లోడ్ చేసుకొనేందుకు మొదటిగా మీరు ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అందుకోసం ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి.
- మీరు రిజిస్టర్ కాకాపోతే రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనే దానిపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ అయ్యి ఈ-పాన్ సెక్షన్ లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత దానిలో న్యూ పాన్ లేదా పాన్ కార్డ్ రీ ప్రింట్ అనే ఆప్షన్ ని ఈ-పాన్ పేజీలో ఎంపిక చేసుకోవాలి.
- మీ వద్ద మీ పాన్ కార్డుకు సంబంధించిన నంబర్ ఇతర వివరాలు ఉంటే పాన్ కార్డు రీ ప్రింట్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత మిమ్మల్ని అది డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్, పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఇతర సమాచారాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి.
ఫీజు చెల్లించాల్సిందే..
మీ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత, వెరిఫికేషన్ పూర్తయ్యాక కొంత మొత్తాన్ని మీరు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది దాదాపు రూ. 50 వరకూ ఉంటుంది. లేదా ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. ఈ ఫీజు చెల్లించిన తర్వాత మీకో కన్ఫర్మరేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మళ్లీ మీరు ఈ-పాన్ పేజీలోకి వెళ్తారు. దానిలో మీ ఈమెయిల్ ఐడీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మెయిల్ కి మీకు పాన్ డౌన్ లోన్ లింక్ వస్తుంది. ఆ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ-పాన్ ని పీడీఎఫ్ ఫార్మేట్ లో పొందుతారు. దీంతో మీకు పాన్ కార్డు పోయిన ఇకపై ఇబ్బంది ఉండదు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి ఈ-పాన్ కార్డును నిమిషాల్లో డౌన్ లోడ్ చేసేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..