Apple iPhone: యాపిల్ ఐఫోన్ కావాలా నాయనా.. మీ కలను నెరవేర్చుకునేందుకు రోజుకు రూ. 73 చాలు..

యాపిల్ ఐ ఫోన్ 12, యాపిల్ ఐఫోఫ్ 12 ప్రో, యాపిల్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ తో పాటు 2020 లో యాపిల్ ఐ ఫోన్ 12 మినీని యాపిల్ లాంచ్ చేసింది. ఇది సైజ్ లో చిన్నగా ఉన్నా.. ఫీచర్ల మాత్రం ఐ ఫోన్ 12 లాగే ఉంటాయి.

Apple iPhone: యాపిల్ ఐఫోన్ కావాలా నాయనా.. మీ కలను నెరవేర్చుకునేందుకు రోజుకు రూ. 73 చాలు..
Apple Iphone Mini
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 08, 2023 | 11:36 AM

యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయడం మీ కలా? అయితే మీకోసం ఓ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. అలాగే బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ అన్నీ కలిపి రోజుకు కేవలం రూ. 73 చెల్లించి యాపిల్ ఐ ఫోన్ మినీని సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి..

ప్రధాన ఫీచర్లు..

ముచ్చటైన యాపిల్ ఐఫోన్ 12 మినీ ఇకపై చరిత్ర కానుంది. యాపిల్ ఐ ఫోన్ 12, యాపిల్ ఐఫోఫ్ 12 ప్రో, యాపిల్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ తో పాటు 2020 లో యాపిల్ ఐ ఫోన్ 12 మినీని యాపిల్ లాంచ్ చేసింది. ఇది సైజ్ లో చిన్నగా ఉన్నా.. ఫీచర్ల మాత్రం ఐ ఫోన్ 12 లాగే ఉంటాయి. ఈ యాపిల్ ఐఫోన్ మినీలో 5.4 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే, ఏ 14 బయోనిక్ చిప్, 12 ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అయితే దీని ఉత్పత్తిని త్వరలో యాపిల్ సంస్థ నిలిపివేయనుంది. ప్రస్తుతం కూడా దీని అమ్మకాలను యాపిల్ సంస్థ నిలిపివేసింది. కేవలం ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ లోనే అందుబాటులో ఉంది.

రోజుకు రూ. 73తో ఎలా ఉంటే..

ఇవి కూడా చదవండి

ఐఫోన్ మినీ ప్రారంభ ధర రూ. 69,900, అయితే ఫ్లిప్ కార్ట్ లో రూ. 5,901 తగ్గింపు తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీ రూ. 53,999గా ఉంది. దీనికి అదనంగా హెచ్ డీ ఎఫ్ సీ డెబిట్ కార్డు ఈఎంఐ ఫెసిలిటీతో బ్యాంక్ రూ. 2000 తగ్గింపును అందిస్తోంది. దీంతో రూ. 51,999కే దీనిని పొందవచ్చు. కొనుగోలుదారులు 24 నెలల వరకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ కార్డుపై నో కాస్ట్ ఈఎంఐని పొందవచ్చు. ఐఫోన్ 12 మినీ కోసం నెలకు రూ. 2250 చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం రోజుకు కేవలం రూ. 73 చెల్లిస్తే సరిపోతుందన్నమాట.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..