Smartwatch: ఈ స్మార్ట్ వాచ్ అంటే ఫ్లవర్ అనుకొంటివా.. ‘ఫైరూ..!’ ఫీచర్లు, పనితీరు మామూలుగా ఉండదు.. ధర ఎంతంటే..

ఫైర్-బోల్ట్ మన దేశంలో కొలైడ్ అనే కొత్త స్మార్ట్ వాచ్‌ను పరిచయం చేసింది. ఇది అనువైన బడ్జెట్ లో నే అత్యద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. హెచ్ డీ డిస్‌ప్లే, ఆకట్టుకునే డిజైన్ తో పాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో వస్తోంది.

Smartwatch: ఈ స్మార్ట్ వాచ్ అంటే ఫ్లవర్ అనుకొంటివా.. ‘ఫైరూ..!’ ఫీచర్లు, పనితీరు మామూలుగా ఉండదు.. ధర ఎంతంటే..
Fire Boltt Collide Smart Watch
Follow us
Madhu

|

Updated on: Apr 08, 2023 | 11:59 AM

ప్రస్తుతం అంతా స్మార్ట్ వాచ్ ల ట్రెండ్ నడుస్తోంది. కంపెనీలు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఫైర్-బోల్ట్ మన దేశంలో కొలైడ్ అనే కొత్త స్మార్ట్ వాచ్‌ను పరిచయం చేసింది. ఇది అనువైన బడ్జెట్ లో నే అత్యద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. హెచ్ డీ డిస్‌ప్లే, ఆకట్టుకునే డిజైన్ తో పాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ను అందిస్తోంది. కాగా ఈ కంపెనీ ఇటీవలే ప్రిస్టైన్ స్మార్ట్‌వాచ్‌ని ఈ ఫీచర్ తో విడుదల చేసింది. ఇప్పుడు ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెక్స్.. ఫైర్ బోల్ట్ కొలైడ్ స్మార్ట్ వాచ్ 10ఎంఎం మెటాలిక్ ఫ్రేమ్ తో పాటు వృత్తాకార స్క్రీన్‌ ను కలిగి ఉంది. ఇది 1.32-అంగుళాల హెడ్ డీ డిస్ ప్లే, 500 నిట్స్ బ్రైట్ నెస్, 360×360 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. సులభమైన యూఐ నావిగేషన్ ను అందిస్తుంది.

ఫీచర్లు.. స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ సెన్సార్, SpO2 సెన్సార్ వంటి హెల్త్ ఫీచర్లను అందిస్తోంది. నడక, పరుగు, సైక్లింగ్ వంటి విభిన్న కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి వినియోగదారులకు 70 రకాల స్పోర్ట్స్ మోడ్‌లను ప్రయత్నించవచ్చు. దీనిలో వాటర్, డస్ట్ రెసిస్టెస్స్ కలిగి ఉంటుంది. అలాగే సిరి, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లు పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా.. ఫైర్-బోల్ట్ సహ-వ్యవస్థాపకులు ఆయుషి కిషోర్, అర్నవ్ కిషోర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి స్మార్ట్‌వాచ్ ను అందించాలనే లక్ష్యంతో ఈ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

సామర్థ్యం.. దీనిలో మెరుగైన కనెక్టివిటీ, తక్కువ విద్యుత్ వినియోగం కోసం 2-ఇన్-1 చిప్ సహాయంతో బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్ పనిచేస్తుంది. 300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు పనిచేస్తుంది. అదనంగా ఈ వాచ్ లో వాతావరణ అప్‌డేట్‌లు, రిమోట్ కెమెరా/మ్యూజిక్ కంట్రోల్‌లు, రిమైండర్‌లు, వివిధ యాప్‌ల నుండి నోటిఫికేషన్‌లు పొందవచ్చు.

ధర ఎంతంటే.. ఫైర్ బోల్ట్ కొలైడ్ ధర రూ. 2,999గా ఉంది. కంపెనీ వెబ్ సైట్ తో పాటు అమెజాన్ ఈ కామర్స్ సైట్ లో లభ్యమవుతుంది. ఈ వాచ్ బ్రౌన్, మ్యాట్ బ్లాక్, గ్రే, సిల్వర్ బ్లాక్, గ్రే బ్లాక్ కలర్‌ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ