- Telugu News Photo Gallery Technology photos Here are top smart phones under rs20,000, check specs, features and more
Smartphones: అధిక సామర్థ్యం.. అద్భుత పనితీరు కలిగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ధర కేవలం రూ. 20,000 లోపే..
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకొంటున్నారా? అది కూడా 5జీ ఫోన్ కావాలనుకొంటున్నారా? మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక కంపెనీల ఫోన్లలో అత్యాధునిక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, మంచి పనితీరు కలిగిన ఫోన్ ఎంపిక చేసుకోవడం కొంచెం కష్టమైన పనే. అది కూడా అనువైన బడ్జెట్ లో దొరకాలంటే ఇంకా కష్టం. ఈ నేపథ్యంలో మీకు ఆ కష్టం లేకుండా బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు మీకు పరిచయం చేస్తున్నాం. కేవలం రూ. 20,000 ధరలోనే మార్కెట్లో లభ్యమవుతున్న ఫోన్లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి..
Madhu |
Updated on: Apr 08, 2023 | 12:19 PM

వన్ ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్ 5జీ(OnePlus Nord CE 3 Lite 5G).. దీనిలో 6.7 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ తో వస్తోంది. 108 ఎంపీ ప్రధాన కెమెరా, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన దీని ధర రూ. 19,999గా ఉంది.

ఐక్యూఓఓ జెడ్7 5జీ(iQOO Z7 5G): రూ. 20,000లోపు ధరలో లాంచ్ అయిన అత్యంత శక్తివంతమైన ఫోన్ ఇది. దీనిలో హెచ్డీఆర్ 10 ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ప్రైమరీ కెమెరా 64ఎంపీ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 920 ప్రాసెసర్ తో వస్తోంది. 44వాట్స్ సామర్థ్యంతో కూడిన ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన ఈ ఫోన్ ధర రూ. 18,999 నుండి ప్రారంభమవుతుంది.

మోటో జీ73 5జీ(Moto G73 5G): ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఇంటర్‌ఫేస్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6.5-అంగుళాల 120Hz ఎల్సీడీ డిస్‌ప్లే, మీడియా టెక్ హీలియో డైమెన్సిటీ 930 ప్రాసెసర్ ఉంటుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది. దీనిలో 50ఎంపీ, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది.

పోకో ఎక్స్5 5జీ(Poco X5 5G): ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం కూడిన వేరియంట్ ధర రూ. 18,999గా ఉంది. దీనిలో120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. మూడు-కెమెరాల సెటప్ తో ఇది వస్తోంది. 48ఎంపీ+8ఎంపీ+2ఎంపీ. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కూడిన 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

రెడ్ మీ నోట్ 12 5జీ(Redmi Note 12 5G): దీనిలో 120Hz అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 48ఎంపీ మెయిన్, 8ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మాక్రో సెన్సార్‌లు ఉంటాయి. 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన వేరియంట్ ధర రూ. 17,999 నుండి ప్రారంభమవుతుంది.





























