Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు ఎలా వాడాలి? ఇవి తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు..

సాధారణంగా ప్రతి క్రెడిట్ కార్డుపై ఆయా సంస్థలు పలు ఆఫర్లు అందిస్తాయి. అలాగే క్యాష్ బ్యాక్ లు, రివార్డు పాయింట్ల వంటివి అందిస్తాయి. అయితే, ఈ ప్రయోజనాలను మీరు పొందుకోవాలి అంటే మీరు క్రెడిట్ కార్డు వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి. దానిని వ్యూహాత్మకంగా ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవాలి.

Credit Card: క్రెడిట్ కార్డు ఎలా వాడాలి? ఇవి తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు..
Credit Card
Madhu
|

Updated on: Apr 08, 2023 | 5:30 PM

Share

క్రెడిట్ కార్డును తెలివిగా ఉపయోగించుకుంటే అది మీకు మీ ఆర్థిక అవసరతలను తీర్చే ఓ గొప్ప అస్త్రంలా ఉపయోగపడుతుంది. అయితే దానిపై అవగాహన లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. సాధారణంగా ప్రతి క్రెడిట్ కార్డుపై ఆయా సంస్థలు పలు ఆఫర్లు అందిస్తాయి. అలాగే క్యాష్ బ్యాక్ లు, రివార్డు పాయింట్ల వంటివి అందిస్తాయి. అయితే, ఈ ప్రయోజనాలను మీరు పొందుకోవాలి అంటే మీరు క్రెడిట్ కార్డు వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి. దానిని వ్యూహాత్మకంగా ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడే మీరు దాని వినియోగంపై అవగాహనకు రావాలి. మీరు చేసే ఖర్చులు.. క్రెడిట్ ఎక్కడ ఎక్కువగా వినియోగిస్తారు? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎటువంటి తప్పులు చేస్తే క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతుందో ముందుగానే తెలుసుకోవాలి. ఇటువంటి వాటిపై పూర్తి అవగాహన కోసం మీకు ఈ కథనం ఇస్తున్నాం. ఒక వేళ మీరు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటుంటే ఈ అంశాల గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచిది. అవేంటో చూద్దాం రండి..

మీ ఖర్చులు ఏమిటి?.. మీ అవసరాలకు అనుగుణంగా క్రెడిట్ కార్డు నున ఎంచుకోవాలి. మీరు తరచూ చేసే ఖర్చులను ముందుగా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక వేళ మీరు తరచూ ప్రయాణాలు చేసే వారైతే ప్రయాణాల బుకింగ్స్ పై వచ్చే ప్రయోజనాలను ఇచ్చే క్రెడిట్ కార్డు ను ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువగా షాపింగ్ చేసేవారైతే ఆ సమయంలో క్రెడిట్ కార్డు వినియోగించాలనుకుంటే షాపింగ్ లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇచ్చే క్రెడిట్ కార్డులు ఎంపిక చేసుకోవాలి.

బోనస్లు.. అనేక క్రెడిట్ కార్డ్‌లు నిర్దిష్ట వ్యవధిలో కనీసం మొత్తాన్ని ఖర్చు చేసే కొత్త కస్టమర్‌లకు స్వాగత బోనస్‌లను అందిస్తాయి. బోనస్‌కు అర్హత సాధించడానికి మీరు ఖర్చు చేయాల్సిన కనీస ఖర్చు, కాలపరిమితిని తనిఖీ చేయండి.

ఇవి కూడా చదవండి

బిల్లులను పూర్తిగా చెల్లించండి.. వడ్డీ ఛార్జీలు ఎక్కువగా పడకుండా ఉండటానికి, మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడానికి ప్రతి నెలా క్రెడిట్ కార్డ్ బిల్లులను పూర్తిగా చెల్లించడం తప్పనిసరి. బిల్లులను సరైన సమయానికి చెల్లించకపోతే.. పాత బిల్లులు కొత్త బిల్లుకు క్యారీ ఫార్వడ్ అయితే దానిపై వడ్డీలు చాలా అధికంగ పడతాయి. పైగా ఇది మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది.

బిల్లింగ్ సైకిల్.. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను మీరు వినియోగిస్తున్నట్లయితే అన్ని కార్డుల బిల్లింగ్ సైకిల్, చెల్లింపుల తేదీలు వేరువేరుగా ఉంటే వాటిని గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది. దీనిని అధిగమించడానికి అన్ని కార్డుల బిల్లింగ్ సైకిల్ తేదీలు ఒక తేదీకి మార్చుకుంటే మేలు. అప్పుడు చెల్లింపుల తేదీలు మర్చిపోయే అవకాశం ఉండదు. అన్ని బిల్లలు ఒకేసారి చెల్లిస్తారు కాబట్టి సిబిల్ స్కోర్ పై ప్రభావం పడదు.

న్యూస్ లెటర్స్ కు సబ్ స్క్రైబ్ చేసుకోండి.. ప్రతి క్రెడిట్ కార్డు ప్రత్యేక ఆఫర్లు కలిగి ఉంటాయి. ఆ ఆఫర్లతో ప్రతి సంస్థ కార్డు దారులకు న్యూస్ లెటర్స్ను పంపిస్తుంది. దీనిని సబ్ స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఆఫర్లతో పాటు రివార్డు పాయింట్లు అందుకొనే వీలుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..