Home Insurance: గృహ బీమా అంటే ఏమిటి.. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి..!

విపత్తు అనేవి ఎప్పుడు కూడా చెప్పిరావు. టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా వేలాది మంది ప్రజలు మరణించారు. వేలాది ఇళ్లు, పెద్దపెద్ద అంతస్తుల భవనాలు సైతం ధ్వంసం అయ్యాయి. భారతదేశంలోని భుజ్, లాతూర్, చమోలీలలో సంభవించిన..

Home Insurance: గృహ బీమా అంటే ఏమిటి.. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి..!
Home insurance
Follow us
Subhash Goud

|

Updated on: Apr 08, 2023 | 5:20 PM

విపత్తులు అనేవి ఎప్పుడు కూడా చెప్పిరావు. టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా వేలాది మంది ప్రజలు మరణించారు. వేలాది ఇళ్లు, పెద్దపెద్ద అంతస్తుల భవనాలు సైతం ధ్వంసం అయ్యాయి. భారతదేశంలోని భుజ్, లాతూర్, చమోలీలలో సంభవించిన భూకంపాల జ్ఞాపకాలను ఇప్పటికీ ప్రజలు మరువలేకపోతున్నారు. గత ఏడాది ఉత్తరాఖండ్, కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి. అలాంటి విపత్తులతో వచ్చే నష్టాలను పూడ్చేందుకు హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం చాలా అవసరం.

హోమ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఇంటికి రక్షణ కవచం లాంటిది. ఇల్లు లేదా ఇంట్లో ఉంచిన వస్తువులకు నష్టం జరిగితే ఇన్సూరెన్స్‌ ద్వారా పరిహారం అందుకోవచ్చు. వరదలు, భూకంపం, అగ్ని ప్రమాదాలు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇళ్లు దెబ్బతింటాయి. దొంగతనం, దోపిడీలు, అల్లర్లు వంటి సంఘటనల వల్ల కూడా ఇళ్లు దెబ్బతింటాయి. అటువంటి పరిస్థితిలో ఇన్సూరెన్స్‌ కంపెనీ జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తుంది. NSSO (National Sample Survey Office) 77వ రౌండ్ నివేదిక ప్రకారం.. బీమా రక్షణ లేకపోవడం వల్ల ధనవంతుల కంటే పేదవారి ఆస్తి, ఆదాయానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు, భూకంపాలు వంటి విపత్తుల ప్రమాదం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల, పేద, ధనికుల మధ్య విభజన నిరంతరం పెరుగుతోంది.

అందుకే, ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీరు మీ ఇల్లు, లేదా దుకాణం లేదా గిడ్డంగి, మీ వద్ద ఉన్నదానికి బీమా చేసుకోవాలి. విపత్తు ప్రమాదాలకు సంబంధించిన బీమా సాధారణ ఇన్సూరెన్స్‌ కేటగిరి కిందకు వస్తుంది. అన్ని సాధారణ బీమా కంపెనీలు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి వివిధ రకాల బీమా ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఒక ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అన్ని రకాల రిస్క్‌లను కవర్ చేసే కొన్ని బీమా ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అందుకే మీరు గృహ, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలను కొనుగోలు చేస్తే, మీరు మీ ఇల్లు, మీ దుకాణాన్ని కవర్ చేయవచ్చు. మీరు వ్యాపారం, అగ్నిమాపక, ప్రాజెక్ట్ బీమాను కొనుగోలు చేస్తే, మీరు మీ వ్యాపారాన్ని విపత్తుల నుంచి రక్షించుకోవచ్చు.

ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ వికాస్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. బీమా కంపెనీలు సాధారణంగా భవన నిర్మాణాన్ని కవర్ చేయాలని సూచిస్తున్నారు. అయితే, పాలసీలో ఇల్లు గానీ షాప్‌లలో ఉంచిన వస్తువులను కూడా కవర్ చేయవచ్చు. మొత్తంగా, ఇల్లు, షాపు కోసం బీమా మూడు రకాలుగా ఉంటుంది. బిల్డింగ్ ఇన్సూరెన్స్‌, కంటెంట్ ఇన్సూరెన్స్‌, అలాగే ఈ రెండింటితో కూడిన ఇన్సూరెన్స్‌.

మీ ఇంట్లో ఉంచిన గృహోపకరణాలలో ఆభరణాలు, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, AC, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉంటాయి. భూకంపాలు, సునామీ, అగ్నిప్రమాదాలు లేదా వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇల్లు లేదా విలువైన వస్తువులకు ఏదైనా నష్టం జరిగితే, బీమా కంపెనీ వాస్తవ ధరను భర్తీ చేస్తుంది. దీని వల్ల జరిగిన నష్టానికి సహాయం అందుతుంది.

బీమా ఎంత ప్రీమియం ఎంత ఉంటుంది..?

సాధారణ బీమా కంపెనీలు 10 నుంచి 20 సంవత్సరాల వరకు చాలా కాలం పాటు ఆస్తి బీమాను అందిస్తాయి. సాధారణంగా ఒకే ప్రీమియం పాలసీ ఉంటుంది. ప్రీమియం చౌకగా ఉంటుంది. ఉదాహరణకు.. ఒక ఫ్లాట్ విలువ 40 లక్షల రూపాయలు అయితే, 10 సంవత్సరాల పాలసీకి దాదాపు 10,000 రూపాయలు ఖర్చవుతుంది. ఇది 40 లక్షల రూపాయల గృహ బీమా కవరేజీని అందిస్తుంది. ఇది 40 లక్షల రూపాయల గృహ బీమా పాలసీకి 1000 రూపాయల వార్షిక వ్యయం అవుతుంది. రోజువారీగా లెక్కించినప్పుడు, ఈ ఖర్చు 3 రూపాయలే. ఇంటిలోని ఇతర వస్తువులతో పాటు ఇంటీరియల్‌ కంటెంట్‌ను కూడా చేర్చినట్లయితే ఇది 8 లక్షల రూపాయల వరకు కవరేజీని అందిస్తుంది. అందుకే 48 లక్షల రూపాయల బీమా కవరేజీకి మొత్తం ఖర్చు వార్షిక ప్రాతిపదికన సుమారు 1050 రూపాయలు అవుతుంది. అలాగే ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కవర్ కావాలనుకుంటే ప్రీమియం కొద్దిగా పెరుగుతుంది.

పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ ఇల్లు, షాపు కోసం బీమా పాలసీని కొనుగోలు చేయడం మీ కారు, బైక్‌కి బీమా పాలసీని కొనుగోలు చేసినంత అవసరం అవుతుంది. అయితే, వాహనాల మాదిరిగా కాకుండా, ఆస్తి బీమా తప్పనిసరి కాదని గుర్తించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి