AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Reserves: ప్రపంచంలోని మొత్తం బంగారు నిల్వల్లో 8 శాతం భారత్‌లోనే..: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

ఫిబ్రవరి 2023లో బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు తర్వాత, ఆర్‌బిఐ వద్ద బంగారం నిల్వ 790.2 టన్నులకు పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌ను..

Gold Reserves: ప్రపంచంలోని మొత్తం బంగారు నిల్వల్లో 8 శాతం భారత్‌లోనే..: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్
అమ్మితే పన్ను.. మీరు బంగారాన్ని కొనుగోలు చేసిన మూడు సంవత్సరాల కంటే తక్కువ సమయంలో అమ్మితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేయిన్స్ ట్యాక్స్ పడుతుంది. అదే మూడు సంవత్సరాల తర్వాత విక్రయిస్తే లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఈ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 20 శాతం వరకూ ఇడెక్సేషన్ బెనిఫిట్ వర్తిస్తుంది. దీనికి అదనంగా రెండు శాతం సెస్ కూడా వసూలు చేస్తారు.
Subhash Goud
|

Updated on: Apr 08, 2023 | 4:15 PM

Share

ఫిబ్రవరి 2023లో బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు తర్వాత, ఆర్‌బిఐ వద్ద బంగారం నిల్వ 790.2 టన్నులకు పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌ను ఉటంకిస్తూ ఈ సమాచారాన్ని వెల్లడించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. ఈ ఆర్‌బిఐ కొనుగోలు తర్వాత, ప్రపంచంలోని 8 శాతం బంగారం నిల్వలు ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నాయి. 2022 మొదటి త్రైమాసికంలో భారతదేశం మొత్తం 760.42 టన్నుల బంగారం కలిగి ఉంది. రెండో త్రైమాసికం ముగిసే సమయానికి 767.89 టన్నులు, మూడో త్రైమాసికం ముగిసే సమయానికి 785.35 టన్నులు, 2022 నాలుగో త్రైమాసికం ముగింపు నాటికి 787.40 టన్నుల నిల్వలు ఉన్నాయి. అంటే గత ఏడాది కాలంలో ఆర్‌బీఐ దాదాపు 30 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.

గ్లోబల్ ఒత్తిడి కారణంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో నెలకొన్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి రాబడి, సురక్షితమైన పెట్టుబడి కోసం ఆర్‌బిఐ బంగారాన్ని భారీగా కొనుగోలు చేసింది. జూన్ 2020, మార్చి 2021 మధ్య, ఆర్బీఐ 33.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. 2021-22లో ఆర్బీఐ దాదాపు రెట్టింపు అంటే 65 టన్నుల బంగారం. ఏప్రిల్ 2020, సెప్టెంబర్ 2022 మధ్య, ఆర్బీఐ 132.34 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అదే సమయంలో భారతీయుల వద్ద దాదాపు 25,000 టన్నుల బంగారం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఆర్బీఐ బంగారం నిల్వల విలువను పరిశీలిస్తే.. 45.20 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ బంగారం విలువ పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో పాటు కొనుగోలుదారులు కొనుగోలు చేసిన అదనపు బంగారం. అందుకే డాలర్‌తో రూపాయి బలహీనపడటం కూడా విలువను పెంచింది. ఆర్థిక ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ వ్యాప్తంగా అన్ని కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలులో బిజీగా ఉన్నాయనే విషయం ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి