Mudra Loan: మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన ఈ పథకానికి 8 ఏళ్లు.. ఈ స్కీమ్‌ కింద రూ.10 లక్షల వరకు రుణం

మీరు కూడా మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే , ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నిరుపేదలకు ఉపశమనం కలిగించడానికి, వారి భవిష్యత్తును మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను..

Mudra Loan: మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన ఈ పథకానికి 8 ఏళ్లు.. ఈ స్కీమ్‌ కింద రూ.10 లక్షల వరకు రుణం
Mudra Loans
Follow us
Subhash Goud

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 08, 2023 | 3:14 PM

మీరు కూడా మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే , ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నిరుపేదలకు ఉపశమనం కలిగించడానికి, వారి భవిష్యత్తును మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. కేంద్రం రూపొందిస్తున్నపలు పథకాల ద్వారా రుణాలు తీసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుంది.

మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకాల ద్వారా ఎంతో మంది లబ్దిపొందారు. ఇప్పటివరకు 40.82 కోట్ల మందికి లబ్ధి చేకూర్చిన అటువంటి ప్రభుత్వ పథకం గురించి తెలుసుకుందాం. వారిలో 69.9% మంది మహిళలు ఉన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ.23.2 లక్షల కోట్లు పంపిణీ చేసింది. పేదలు, రైతులు, సామాన్యులకు రుణాలు అందించడం ద్వారా దేశంలో వ్యాపారాన్ని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఇక మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా యోజన పథకం గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ముద్రా యోజన నుంచి సులభంగా రుణాలు..

ఈ పథకం కింద వ్యాపారాన్ని ప్రారంభించడానికి గ్యారెంటీ లేకుండా భారత ప్రభుత్వం మీకు 10 లక్షల రూపాయల వరకు రుణాన్ని ఇస్తుంది. చిన్నా, పెద్ద వ్యాపారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రారంభించింది కేంద్రం. నేటితో ఈ పథకం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీని కారణంగా భారత ప్రభుత్వ ముద్రా యోజన ప్రయోజనాన్ని పొందడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు తమ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన భారతదేశంలో స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

50 వేల నుంచి 10 లక్షల వరకు రుణం పొందవచ్చు:

ఈ పథకం కింద, మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రభుత్వం మీకు ప్రత్యేక రకం ముద్రా కార్డును అందిస్తుంది. మీరు డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి లేదా డెబిట్ కార్డ్‌గా ఈ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఈ లోన్ కోసం మీకు ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీ విధించరు. చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు 50 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకు సులభంగా రుణం తీసుకోవచ్చు.

ఇలా దరఖాస్తు చేసుకోండి:

ప్రధాన మంత్రి ముద్రా యోజన కోసం దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. మీరు దాని అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు mudra.org.in ని సందర్శించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి