Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా.? ఏ కారణానికి ఎంత డబ్బు తీసుకోవచ్చో తెలుసా.?

ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఎందులో ఉద్యోగం చేసిన వారికైనా ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్ (పీఎఫ్‌) ఖాతా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ ఖాతాలో ప్రతీ నెల ఉద్యోగి జీతం నుంచి కొత్త మొత్తాన్ని కట్ చేసి జమ చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తానికి వడ్డీ జమ చేస్తుంటుంది..

EPFO: పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా.? ఏ కారణానికి ఎంత డబ్బు తీసుకోవచ్చో తెలుసా.?
Withdraw Pf Amount
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 08, 2023 | 3:19 PM

ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఎందులో ఉద్యోగం చేసిన వారికైనా ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్ (పీఎఫ్‌) ఖాతా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ ఖాతాలో ప్రతీ నెల ఉద్యోగి జీతం నుంచి కొత్త మొత్తాన్ని కట్ చేసి జమ చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తానికి వడ్డీ జమ చేస్తుంటుంది. సాధారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత విత్‌ డ్రా చేసుకునే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్‌ నగదును రిటైర్మెంట్‌కు ముందే తీసుకునే అవకాశం ఉంది. ఈఎపీఎఫ్‌ఓ మెంబర్స్‌ పోర్టల్‌లోకి వెళ్లి కావాల్సిన సమాచారం అందించి మన పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ముందస్తుగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఉద్యోగులు కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. ఏ కారణానికి ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉద్యోగులు తమ వివాహ ఖర్చు కోసం కూడా పీఎఫ్‌ ఖాతా నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ ప్రావిడెంట్‌ ఫండ్‌ నుంచి 50 శాతం వరకు తీసుకోవచ్చు. ఇందుకోసం అవసరమైన డ్యాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.

* ప్రైవేటు ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఉద్యోగం కోల్పోయిన వారు కూడా తమ పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇలాంటి వారు మీ ప్రావిడెంట్ ఫండ్‌ నుంచి 75 శాతం నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 2 నెలల కంటే ఎక్కువ సమయం మరో ఉద్యోగం దొరక్కపోతే మీగతా 25 శాతాన్ని కూడా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

* అనారోగ్య సంబంధిత అవసరాల కోసం కూడా పీఎఫ్‌ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో 6 నెలల కనీస వేతనం, ఉద్యోగి వాటాతో సహా వడ్డీ కూడా తీసుకొవచ్చు.

* ఇంటి మరమ్మతుల పనుల కోసం కూడా పీఎఫ్‌ నగదును తీసుకునే సదుపాయం ఉంటుంది. దీనిద్వారా 12 నెలల కనీస వేతనం, డీఏతో పాటు, ఉద్యోగి వాటాలో కొంత మొత్తం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

* పిల్లల పై చదువుల కోసం కూడా పీఎఫ్‌ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. విద్యార్థుల పై చదువులకు అయ్యే ఖర్చులను భరించడానికి 50 శాతం వరకు పీఎఫ్‌ నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.

* ఉద్యోగి వైకల్యం బారిన పడితే.. 6 నెలల కనీసం వేతనం, డీఏ సహా వడ్డీతో కూడిన ఉద్యోగుల వాటాను విత్‌డ్రా చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..