- Telugu News Photo Gallery Business photos Car Discount Offer: Mahindra announces discounts for Thar, Bolera, XUV300 and more
Car Discount Offer: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. ఈ కారు కొనుగోలుపై రూ.72 వేల డిస్కౌంట్!
ఈ మధ్య కాలంలో సామాన్యుడు సైతం కారు కొనేందుకు ఇష్టపడుతున్నాడు. వివిధ కార్ల తయారీ కంపెనీలు కూడా బడ్జెట్ ధరల్లో కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కొన్ని కంపెనీలు కార్లపై భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మీరు కొత్త..
Updated on: Apr 08, 2023 | 3:46 PM

ఈ మధ్య కాలంలో సామాన్యుడు సైతం కారు కొనేందుకు ఇష్టపడుతున్నాడు. వివిధ కార్ల తయారీ కంపెనీలు కూడా బడ్జెట్ ధరల్లో కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కొన్ని కంపెనీలు కార్లపై భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తే మీకో గుడ్‌న్యూస్. ఏప్రిల్ నెలలో అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది మహీంద్రా కంపెనీ. ఏప్రిల్‌నెలలో పలు మోడళ్లపై భారీ డిస్కంట్‌ను అందిస్తోంది. ఏకంగా రూ.72 వేల వరకు తగ్గింది ఆఫర్‌ను అందిస్తోంది.

థార్, ఎక్స్‌యూవీ 300,మరాజో, బొలెరో వంటి మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే మీరు ఎంచుకునే కారును బట్టి డిస్కౌంట్ మారుతుంటుందని గమనించాలి.

బొలెరో కారుపై ఏకంగా రూ.66 వేల వరకు తగ్గింపు ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ వాహనం జనాల్లో ఇంకా కేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ వాహనంపై క్యాష్ డిస్కౌంట్ రూపంలో 51 వేలు, అలాగే రూ.15 వేల విలువైన యాక్సరిసీస్ ఉచితంగా పొందవచ్చు.

ఎక్స్‌యూవీ 300 మోడల్ విషయానికొస్తే.. దేశంలో అందుబాటులో ఉన్న సేఫేస్ట్ ఎస్‌యూవీలలో ఇది ఒకటని చెప్పాలి. దీనికి 5స్టార్ రేటింగ్ ఉంది. ఈ కారుపై రూ.52 వేల వరకు తగ్గింపు ఆఫర్‌ను పొందవచ్చు.

అలాగే థార్ 4వీల్ డ్రైవ్ కారుపై కూడా డిస్కౌంట్ ప్రయోజనం అందిస్తోంది కంపెనీ. ఈ వాహనంపై రూ.40 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

ఇక మరాజో కారుపై కూడా భారీ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై రూ. 72 వేల వరకు డిస్కౌంట్ పొందే సదుపాయం అందిస్తోంది. అయితే ఇందులో వివిధ రకాల వేరియంట్లు ఉన్నాయి. అయితే ఈ కార్లపై వేరియంట్లను బట్టి డిస్కౌంట్‌లలో మార్పులు ఉంటాయని గమనించాలి.





























