- Telugu News Photo Gallery Business photos These are the best affordable scooters in india, just under rs50,000, check list
Scooters Under 50k: సిటీ పరిధిలో బెస్ట్ స్కూటర్లు ఇవే.. ధర కేవలం రూ. 50,000 లోపు మాత్రమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..
మన దేశంలో ఏ సిటీ చూసినా హెవీ ట్రాఫిక్ కనిపిస్తుంది. సిటీ పరిధిలో కార్లలో ప్రయాణించాలంటే ప్రయాసతో కూడుకున్నదే. సమయంతో పాటు ఇంధనం కూడా వృథా అయిపోతుంది. ఈ నేపథ్యంలో లోకల్ అవసరాలకు బైక్లు, స్కూటర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే మీరు ఒకవేళ బైక్ గానీ స్కూటర్ కొనుగోలు చేయాలనుకొంటే అది కూడా అతి తక్కువ ధరలో కావాలంటే ఈ కథనం మిస్ అవ్వద్దు. కేవలం రూ. 50,000 లోపు ధరలోనే అధిక మైలేజీ, మంచి పనితీరును అందించే బైక్ లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిల్లో పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్లు కూడా ఉన్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..
Madhu |
Updated on: Apr 08, 2023 | 6:30 PM

టీవీఎస్ ఎక్స్ఎల్(TVS XL100).. గ్రామీణ ప్రజానీకానికి బాగా కనెక్ట్ అయిన ద్విచక్రవాహనం ఇది. ఏకంగా ఆరు వేరియంట్లలో ఇది లభ్యమవుతోంది. రూ. 46,671 నుంచి రూ.57,790 మధ్య వీటి ధరలు ఉన్నాయి. 15 విభిన్న రంగులలో ఇది అందుబాటులో ఉంది. 99సీసీ బీఎస్6 ఇంజిన్ ఇందులో ఉంది. 4.4 పీఎస్ పవర్, 6.5 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తోంది. సైలెంట్ స్టార్టర్, ఇంజిన్ కిల్ స్విచ్, యూఎస్బీ చార్జింగ్ పోర్టు, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కోమాకి ఎక్స్ జీటీ కేఎం(Komaki XGT KM).. ఇది ప్రయాణ ప్రయోజనాల కోసం ఉద్ధేశించిన ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిలో అండర్ సీట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. మార్చుకోదగిన బ్యాటరీ సెటప్ ఉంటుంది. అలాగు డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, సింక్రోనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ లాక్ వంటి అధునాతన ఫీచర్లు ఈ స్కూటర్ లో అందుబాటులో ఉన్నాయి. దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 130 నుంచి 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ చేయడానికి దాదాపు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది.

అవాన్ ఈ లైట్(Avon E Lite).. దేశంలో అత్యంత సరసమైన ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది కూడా ఒకటి. దీనిని కేవలం రూ. 28,000 కే మార్కెట్లో లబ్యమవుతుంది. దీనిలోని బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయడానికి 4 నుంచి 8 గంటల సమయం పడుతుంది. సింగిల్ చార్జ్ పై 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

లోహియా ఓమా స్టార్(Lohia Oma Star).. ఇది పూర్తిగా మన దేశంలో తయారైన మోడల్. దీనిలో క్లచ్ రహిత గేర్ బాక్స్ ఉంటుంది. సీటు కింద పొడవాటి స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 41,444 నుంచి ప్రారంభమవుతుంది. రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. రెండో వేరియంట్ ఓమా స్టార్ ధర రూ. 51, 570 ఉంది.

అవాన్ ఈ స్కూట్(Avon E Scoot).. అవాన్ ఈ స్కూట్ కూడా మేడిన్ ఇండియా బైక్. దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 65 కిలోమీటర్ల పరిధి ఇస్తుంది. దీని ధర రూ. 45,000 నుంచి ప్రారంభమవుతుంది.

టెక్కో ఎలక్ట్రా నియో(Techo Electra Neo).. మనదేశంలో రూ. 41,919కే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. దీనిలో మోటార్ 250 వాట్స్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్ సిస్టమ్ లను కలిగి ఉంది. ఇది నాలుగు రంగులలో లభిస్తోంది. దీనిలోని బ్యారీ సింగిల్ చార్జిపై 60 నుంచి 65 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి ఐదు నుంచి ఏడు గంటలు పడుతుంది. అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డిజిటల్ స్పీడోమీటర్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.





























