AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ రూల్స్‌లో భారీ మార్పులు.. కేంద్రం కీలక నిర్ణయం.. ఇక నుంచి మళ్లీ ఆ పథకం స్టార్ట్

ఈపీఎఫ్‌వో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్ ఆప్షన్ సెలక్ట్ చేసినవారికి శుభవార్త అందించింది. 2014కి ముందు పెన్షన్ కోసం అధిక మొత్తంలో చెల్లించినవారికి ఊరట కలిగించింది. తిరిగి ఈ ఆప్షన్‌కు ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు..

EPFO: పీఎఫ్ రూల్స్‌లో భారీ మార్పులు.. కేంద్రం కీలక నిర్ణయం.. ఇక నుంచి మళ్లీ ఆ పథకం స్టార్ట్
Epfo 4
Venkatrao Lella
|

Updated on: Feb 22, 2026 | 5:41 PM

Share

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. ఈపీఎఫ్‌వో పెన్షన్ రూల్స్‌లో తాజాగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. గతంలో 2014 వేతన సీలింగ్‌కు ముందు తమ పూర్తి జీతం ఆధారంగా పెన్షన్‌కు నగదు కాంట్రిబ్యూట్ చేసేవారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. అర్హత కలిగిన చందాదారులకు పూర్తి జీతంతో అనుసంధానించిన అధిక పెన్షన్ ఎంపికను పునరుద్దరించారు. ఇక నుంచి అధిక పెన్షన్ ప్రయోజనాన్ని పొందటం వారు కొనసాగించవచ్చని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. 2014 సీలింగ్ సవరణ తర్వాత పెన్షన్ లెక్కపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఈపీఎఫ్‌వో ఆ నిబంధనపై ఇప్పుడు పూర్తి స్పష్టత ఇచ్చింది.

2014 నిబంధనపై క్లారిటీ

2014లో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నియమాలను సవరించింది. ఈపీఎఫ్ కనీస వేతన పరిమితిని రూ.వెయ్యిగా నిర్ణయించగా.. పెన్షన్ పొందదగిన జీతాన్ని నెలకు రూ.15 వేలకు పరిమితం చేసింది. ఒక ఉద్యోగికి ఎక్కువ బేసిక్ శాలరీ ఉన్నప్పటికీ.. నెలలకు రూ.15 వేలు మాత్రమే పొందేలా నిబంధనలు జారీ చేసింది. దీని వల్ల చాలామంది ఖాతాదారులకు గరిష్ట నెలవారీ పెన్షన్ రూ.7,500కే పరిమితమైంది. అయితే రూ.15 వేలు కంటే అధిక జాతాలు అందుకునేవారు వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్ చెల్లించడానికి అనుమతి లేదు. దీని వల్ల అధిక ఆదాయం సంపాదించేవారికి పెన్షన్ సొమ్ము తగ్గుతుంది.

2014కి ముందు ఎలా ఉండేదంటే..?

అయితే 2014కి ముందు ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్‌కు అధిక మొత్తంలో చెల్లించవచ్చు. దీని వల్ల చాలామంది అధిక పెన్షన్ చెల్లించేందుకు ముందుకొచ్చారు. అయితే 2014లో చేసిన సవరణల తర్వాత ఆ ఎంపికను నిలిపివేశారు. దీని వల్ల రెండు సంవత్సరాలు అధిక మొత్తంలో చేసే చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో పెన్షన్ కోసం అధిక సొమ్ము చెల్లించేవారిలో గందరగోళం నెలకొంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. అంటే 2014కి ముందు అధిక పెన్షన్ ఎంపిక చేసుకునేవారు ఇప్పుడు మళ్లీ అదే విధానాన్ని అనుసరించవచ్చు. కానీ అధిక పెన్షన్ కోసం ఎక్కువ మొత్తంలో చెల్లించాలంటే యజమాని సమ్మతి అవసరమని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. యజమాని అంగీకరించకుండా ఉద్యోగులు అధిక మొత్తంలో పెన్షన్ పొందలేరు. అయితే  2014కి ముందు అధిక సహకారాలను ఎంచుకోని ఖాతాదారులకు మాత్రం ప్రస్తుం ఉన్న  రూ. 15 వేల కనీస వేతన పరిమితి కొనసాగుతుంది. కాగా 2014కి ముందు అధిక పెన్షన్ ఎంచుకున్నవారికి మాత్రం ఈపీఎఫ్‌వో తాజా నిర్ణయంతో ఊరట కలిగిందని చెప్పవచ్చు.

Follow Us
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.
ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని
ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..