AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. IMDBలో టాప్ రేటింగ్

అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా కూడా సేమ్ టు సేమ్ అలాంటి కథతోనే తెరకెక్కింది. థియేటర్లలో సంచలనం విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. IMDBలో టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 14, 2026 | 7:25 AM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఆగస్టు 14) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. రష్మిక మందన్నా కాక్ టెయిల్ 2, కంగనా రనౌత్ భారత భాగ్య విధాత, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, అచ్యుత అవతారం.. ఇలా సుమారు 20 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. వీటిలో ఒక మలయాళ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. టాలీవుడ్ నటుడు సునీల్ ఇందులో సీరియస్ పాత్రలో అదరగొట్టడం విశేషం. ఈ సినిమా స్టోరీ పుష్ప తరహాలో సాగుతుంది. కేరళ – తమిళనాడు అటవీ సరిహద్దుల్లోని ‘ఆనకుల్లి’ అనే మారుమూల గ్రామం నేపధ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆ గ్రామస్తులపై తరచూ ఏనుగులు దాడులు చేస్తుంటాయి. ఈ క్రమంలో మారి అనే ఓ వేటగాడు వచ్చి ఏనుగుల భయం నుంచి ఆ ఊరిని కాపాడతాడు. అయితే కాల క్రమేణా మారి ఆ గ్రామాన్ని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి, ఏనుగు దంతాల అక్రమ రవాణాతో ఒక స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు.

ఇదే క్రమంలో మారికి ఎడ్డీ అనే మరో ప్రత్యర్థి కూడా రంగంలోకి దిగుతాడు. దీంతో ఇరు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ మొదలవుతుంది. ఇంతలోనే ఈ గ్రామంలోని ఆంటోనీ ఎంట్రీ ఇస్తాడు. అమాయక గ్రామస్థులపై జరుగుతున్న హింస, అక్రమాలను చూసి చలించిపోతాడు. తనను నమ్ముకున్న గ్రామస్తుల కోసం ఆంటోని ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు కాట్టాలన్. పాల్ జార్జ్ తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ లో ఆంటోనీ వర్గీస్, సునీల్, జగదీష్, దుషారా విజయన్, కబీర్ దుహాన్ సింగ్, పార్థ్ తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే స్టార్ డైరెక్టర్, డీసీ హీరో లోకేష్ కనగరాజ్ ఓ క్యామియో పాత్రలో మెరిశాడు. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మనోరమా మ్యాక్స్ తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

సునీల్ కాటాలన్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us