AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి! స్టెప్ బై స్టెప్ క్లియర్‌ ప్రాసెస్ ఇదే

LPG వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మొబైల్ ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చు. సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక యాప్, Aadhaar Face RD యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్‌తో లాగిన్ అవ్వాలి. Aadhaar Authentication ఎంచుకుని, ఆధార్ నంబర్ నమోదు చేసి ఫేస్ స్కాన్ పూర్తి చేస్తే e-KYC పూర్తవుతుంది.

2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి! స్టెప్ బై స్టెప్ క్లియర్‌ ప్రాసెస్ ఇదే
Gas Ekyc
SN Pasha
|

Updated on: Aug 14, 2026 | 6:46 AM

Share

గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని, లేనిపక్షంలో సరఫరా నిలిపివేస్తామని చమురు సంస్థలు ఆదేశాలు జారీచేశాయి. ఈ నెల 16వ తేదీలోపు ప్రతి గ్యాస్ వినియోగదారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే చాలా మంది కచ్చితంగా తమ గ్యాస్ ఏజెన్సీకి, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌కు వెళ్లి మాత్రమే ఈ ఈకేవైసీ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇంటి నుంచి కూడా ఈ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొబైల్‌ ఫోన్‌ ద్వారా LPG గ్యాస్ e-KYC పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మీ గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన అధికారిక యాప్‌తో పాటు ఆధార్ ఫేస్ RD యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

ఇండేన్ గ్యాస్ వినియోగదారులు IndianOil ONE, HP Gas వినియోగదారులు HP Pay, భారత్ గ్యాస్ వినియోగదారులు HelloBPCL యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫేస్ ఐడెంటిఫీకేషన్ కోసం Aadhaar Face RD యాప్ అవసరం.

ముందుగా గ్యాస్ కనెక్షన్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌తో సంబంధిత యాప్‌లో లాగిన్ అవ్వాలి. మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేసి ఖాతాను ధృవీకరించుకోవాలి. అనంతరం మెనూలో LPG e-KYC, Aadhaar Authentication వంటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, అవసరమైన పర్మిషన్స్ ఇవ్వాలి. Capture Face లేదా Scan Face ఆప్షన్‌పై క్లిక్ చేసి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటిస్తూ కెమెరా ముందు ముఖాన్ని చూపించాలి. ఫేస్ స్కాన్ పూర్తయిన తర్వాత e-KYC విజయవంతంగా పూర్తయినట్లు కర్ఫర్మెషన్ మెసేజ్ లేదా గ్రీన్ టిక్ కనిపిస్తుంది.

అయితే యాప్ పేర్లు, మెనూ ఆప్షన్లు లేదా e-KYC ప్రక్రియలో మార్పులు ఉండొచ్చు. కాబట్టి అధికారిక యాప్‌లనే ఉపయోగించడం, ఆధార్ వివరాలను అనధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్లలో నమోదు చేయకపోవడం చాలా ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పితృ పక్షం 2026 : శ్రాద్ధం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? తేదీ ఇదే
పితృ పక్షం 2026 : శ్రాద్ధం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? తేదీ ఇదే
భోజనం తర్వాత గోరువెచ్చని నీరు తాగటం అలవాటు చేసుకోండి.. లాభాలెన్నో
భోజనం తర్వాత గోరువెచ్చని నీరు తాగటం అలవాటు చేసుకోండి.. లాభాలెన్నో
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!