Gold Rate: బంగారం ధరలపై బిగ్ బాంబ్.. త్వరలో రూ.2 లక్షల మార్క్..? షాకింగ్ రీజన్ ఇదే..
బంగారం ధరలపై బాంబ్ పేల్చే వార్త ఒకటి బయటికి వచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, ఫెడ్ వడ్డీ రేట్లలో కొత విధిస్తే పసిడి ధరలు ఒకేసారి భారీగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. రూ.2 లక్షల మార్క్‌కు కూడా చేరుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

బంగారం ధరలపై పెద్ద షాకింగ్ న్యూస్ ఒకటి వెలువడింది. అదేంటంటే.. బంగారం ధరలు రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం భవిష్యత్తులో ఉందంట. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య శాంతికి చర్చలు జరుగుతున్నా.. ఇంకా చల్లబడటం లేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో గత వారంలో బంగారం ధరలు పెరగ్గా.. ఈ వారంలో కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇదే కొనసాగితే బంగారం ధరలు రూ.2 లక్షల మార్క్‌కు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఈ ఏడాదిలో రూ.2 లక్షల మార్క్..?
గత నెలలో గోల్డ్ రూ.1.90 లక్షల మార్క్‌కు చేరుకుని ఆల్ టైం రికార్డ్ నమోదు చేయగా.. ఆ తర్వాత దిగుతూ వచ్చాయి. ప్రస్తుతం రూ.1.60 లక్షల వద్ద ఊగిసలాడుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రానున్న కొద్ది నెలల్లో గోల్డ్ రేట్లు పెరగొచ్చని విశ్లేషిస్తున్నారు. ఇక ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై ఇంకా స్పష్టత రాలేదు. వడ్డీ రేట్లను తగ్గిస్తుందా.. లేదా పెంచుతుందా అనేది క్లారిటీ రాలేదు. చాలాకాలంగా దీని గురించి పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కొత విధించవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే బంగారం ధరలు భగ్గుమంటాయి. ఎందుకంటే వడ్డీ తగ్గించడం వల్ల పెట్టుబడులపై వచ్చే ఆదాయం తగ్గుతుంది. దీని వల్ల బంగారంలో పెట్టుబడులు పెడతారు.
ఈ రెండే కీలకం
అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లలో కొత జరిగితే మాత్రం గోల్డ్ రేట్లు రూ.2 లక్షల మార్క్‌కు చేరుకునే అవకాశముందని చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు వచ్చేంతవరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశముందని అంటున్నారు. దీంతో బంగారం ధరలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2025 నుంచి గోల్డ్, వెండి ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. గత నెలలో జీవితకాలపు గరిష్ట స్థాయిని తాకగా.. ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇంకెంత పెరుగుతాయనేది దానిపై పెట్టుబడిదారులు, సామాన్య ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మరి నిజంగానే గోల్డ్ రూ.2 లక్షల మార్క్‌కు చేరుకుంటుందా.. లేక తగ్గుతుందా అనేది వేచి చూడాలి.
