Electric Scooter: మార్కెట్లోకి దూసుకొచ్చిన సరికొత్త ‘రైడర్’.. ఫీచర్లు, రేంజ్ మామూలుగా లేవుగా..
రైడర్ సూపర్‌మ్యాక్స్ సరసమైన ధరలో అసాధారణమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనిలో అధునాతన ఫీచర్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ స్కూటర్ ని మార్కెటింగ్ చేయడానికి కంపెనీ ఇటీవల గోవాలో తన మొదటి ప్రత్యేక డీలర్‌షిప్‌ను ప్రారంభించింది.
ప్రముఖ విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జెమోపై(Gemopai) ఎలక్ట్రిక్ మన దేశంలో తన సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే దేశంలో విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు జెమోపై కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తోంది. మార్కెట్లో తన ఉత్పత్తులను ఎక్స్ పాండ్ చేస్తోంది. దేశంలో ని ప్రధాన నగరాలతో పాటు నేపాల్ లో కూడా తన మార్కెట్ ను విస్తరించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ జెమోపై రైడర్ సూపర్ మ్యాక్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కంపెనీ లక్ష్యం ఇదే..
ఈ రైడర్ సూపర్‌మ్యాక్స్ సరసమైన ధరలో అసాధారణమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనిలో అధునాతన ఫీచర్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ స్కూటర్ ని మార్కెటింగ్ చేయడానికి కంపెనీ ఇటీవల గోవాలో తన మొదటి ప్రత్యేక డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. 2023 చివరి నాటికి 100,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించాలనే లక్ష్యాన్ని సాధించడానికి, జెమోపై ఈ సంవత్సరం 3ఎస్ కాన్ఫిగరేషన్‌తో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 300 డీలర్‌షిప్‌లను మోహరించాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు అమిత్ రాజ్ సింగ్ మాట్లాడుతూ తాము ఈ కొత్త మోడల్ ను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తయారు చేసినట్లు చెప్పారు. రానున్న త్రైమాసికంలో తమ ఉత్పత్తులను మరింత అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్కూటర్లను తయారు చేసి, మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
దేశంలో ఇక్కడే ఎక్కువ అమ్మకాలు.. భారతదేశంలోని కేరళ, కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి .
స్పెసిఫికేషన్లు ఇలా..
రైడర్ సూపర్ మ్యాక్స్ బైక్ లో 1600 వాట్ల రేటెడ్ అలాగే 2700 వాట్ల పీక్ పవర్ ను అందించే మోటర్ ఉంటుంది. బీఎల్డీసీ హబ్ మోటార్ ఉంది. ముందు వైపు డిస్క్ బ్రేకు, వెనుక వైపు డ్రమ్ బ్రేకు సిస్టమ్ ఉంటుంది. దీనిలో బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం ఆగకుండా ప్రయాణిస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 5 నుంచి 6 గంటలు సమయం పడుతుంది. బ్యాటరీపై మూడేళ్ల వారంటీ ఉంటుంది. డిజిటల్ స్పీడో మీటర్ ఉంటుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..