AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Scooter: రూ. లక్షలోపు ధరలోనే హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఇతర వివరాలు..

మీరు హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎదురుచూస్తున్నారా? అయితే మీ సెర్చింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేయండి. కేఎల్బీ కోమాకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది.

Electric Scooter: రూ. లక్షలోపు ధరలోనే హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఇతర వివరాలు..
Komaki Se Electric Scooter
Madhu
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Apr 09, 2023 | 8:16 AM

Share

మీరు హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎదురుచూస్తున్నారా? అయితే మీ సెర్చింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేయండి. కేఎల్బీ కోమాకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీని పేరు కోమాకి ఎస్ఈ. మన దేశీయ మార్కెట్లో ఈ స్కూటర్లు అత్యంత అనువైన స్కూటర్లుగా పరిగణించబడుతున్నాయి. దీనిలోని మెకానిజమ్ రైడర్స్ కి కమ్ ఫర్ట్ ని అందిస్తుంది. దీనిలోని ఫీచర్లు, పలు రకాల వేరియంట్లు రైడర్లకు అత్యద్భుతమైన డ్రైవింగ్ అనుభూతినిస్తాయి. ఈ స్కూటర్ కి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాల చూద్దాం..

లుక్, డిజైన్.. కోమాకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టీఎఫ్టీ స్క్రీన్‌తో కూడిన డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ఉంది, ఇది లాంగ్ రైడ్‌ల సమయంలో కంటి ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ డ్యాష్‌బోర్డ్ కాలింగ్ సిస్టమ్ నావిగేషన్ సిస్టమ్ లను కలిగి ఉంది. ఈ స్కూటర్ ముందు భాగం కొద్దిగా స్పోర్ట్స్ బైక్-రకం రూపాన్ని కలిగి ఉంది.

స్టోరేజి.. ఈ స్కూటర్ లో ఇది 20L బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. తద్వారా రైడర్‌లు తగినంత లగేజీని తీసుకువెళ్లడానికి అనుమతిస్తుంది. డీఆర్ఎల్ ఎల్ఈడీ లైట్లను కలిగి ఉంది. యూఎస్బీ చార్జింగ్ పోర్టు ఉంది. కలర్ ఆప్షన్స్.. ఈ కోమాకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. గార్నెట్ రెడ్, జెట్ బ్లాక్, ప్యూర్ గోల్డ్, రాయల్ బ్లూ.

ఇవి కూడా చదవండి

మూడు వేరియట్లు.. ఈ స్కూటర్ మూడు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కొక్కటి వేర్వేరు బ్యాటరీ పవర్, రేంజ్, టాప్ స్పీడ్, ధరతో ఉంటాయి. ఆ 3 వేరియంట్‌ల పేర్లు ఇవే కోమాకి ఎస్ఈ ఎకో, కోమాకి ఎస్ఈ స్పోర్ట్, కోమాకి స్పోర్ట్ అప్ గ్రేడ్.

  • కోమాకి ఎస్ఈ ఎకో స్కూటర్.. ఇది 62V 35 AH సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది. 3000 వాట్ల సామర్థ్యంతో మోటార్ ఉంటుంది. బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 75 నుంచి 90 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. డ్యూయల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. గరిష్టంగా 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర 96,000 ఎక్స్-షోరూమ్ ఉంది.
  • కోమాకి ఎస్ఈ స్పోర్ట్.. దీనిలో 74V 44 AH సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 110 నుంచి 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుతుంది. 3000 వాట్ల పవర్ ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. ఇది గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. డ్యూయల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. దీని ధర రూ.1.29 లక్షలు ఎక్స్-షోరూమ్ ఉంటుంది.
  • కోమాకి ఎస్ స్పోర్ట్(అప్ గ్రేడెడ్).. దీనిలో 75V 50 AH సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 150 నుంచి 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుతుంది. 3000 వాట్ల పవర్ ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. ఇది గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. డ్యూయల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. దీని ధర రూ. 1.38 లక్షలు ఎక్స్-షోరూమ్ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..