Tax Planning: కొత్త ఆర్ధిక సంవత్సరం.. టాక్స్ ప్లానింగ్ చేస్తున్నారా? రూల్స్ మారాయి.. అవేంటో తెలుసుకోండి

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయింది. దీనితో పాటు ఆదాయపు పన్నుకు సంబంధించిన పలు నిబంధనలు కూడా మారాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో తాజాగా టాక్స్ ప్లానింగ్ కు కూడా సమయం దగ్గరపడింది. అటువంటి పరిస్థితిలో..

Tax Planning: కొత్త ఆర్ధిక సంవత్సరం.. టాక్స్ ప్లానింగ్ చేస్తున్నారా? రూల్స్ మారాయి.. అవేంటో తెలుసుకోండి
Tax Planning
Follow us
Subhash Goud

|

Updated on: Apr 08, 2023 | 5:56 PM

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయింది. దీనితో పాటు ఆదాయపు పన్నుకు సంబంధించిన పలు నిబంధనలు కూడా మారాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో తాజాగా టాక్స్ ప్లానింగ్ కు కూడా సమయం దగ్గరపడింది. అటువంటి పరిస్థితిలో, టాక్స్ ప్లానింగ్ చేసుకునే ముందు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడం ముఖ్యం. అందుకే 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన పన్నుకు సంబంధించిన 10 ప్రధాన మార్పుల గురించి తెలుసుకుందాం.. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

  1. కొత్త పన్ను విధానం ఈ సంవత్సరం నుంచి డిఫాల్ట్ పన్ను విధానం అవుతుంది. మీరు కొత్త లేదా పాత పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే, కొత్త పన్ను విధానం యాక్టివ్ అవుతుంది. తగ్గింపులు, మినహాయింపులతో పాత పన్ను విధానాన్ని కొనసాగించాలంటే పాత పద్ధతినే ఎంచుకోవాలి.
  2. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A కింద పన్ను మినహాయింపు పరిమితి రూ. 12,500 నుంచి రూ. 25,000కి పెంచారు. అటువంటప్పుడు కేవలం రూ. 7 లక్షల కంటే ఎక్కువ పన్ను విధించదగిన ఆదాయంపై పన్ను ఉండదు. పాత పన్ను విధానంలో 5 లక్షల రూపాయల వరకూ పన్ను విధించేవారు కాదు.
  3. కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపు పరిమితి. ఆదాయపు పన్ను రేట్లు మార్చారు. ఇప్పుడు రూ. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. రూ. 3 నుంచి 6 లక్షల ఆదాయంపై 5% – 6 నుంచి 9 లక్షల ఆదాయంపై 10% , 9 నుంచి 12 లక్షల ఆదాయంపై 15%… 12 నుంచి 15 లక్షల ఆదాయంపై 20% అలాగే 15 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయంపై 30% పన్ను విధిస్తారు.
  4. జీతం పొందే వ్యక్తికి స్టాండర్డ్ డిడక్షన్ ఇప్పుడు కొత్త పన్ను విధానంలో భాగం అవుతుంది. దీని కింద పన్ను చెల్లింపుదారు రూ. 50,000 తగ్గింపును పొందుతారు. రూ. 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే జీతం పొందిన వ్యక్తి స్టాండర్డ్ రూపంలో రూ. 52,500 తగ్గింపు ప్రయోజనం పొందుతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. అంతకుముందు ఇది రూ.3 లక్షలు మాత్రమే. దీంతో ఉద్యోగి పదవీ విరమణ సమయంలో లేదా ఉద్యోగం మానేసిన సమయంలో పన్ను భారం తగ్గుతుంది.
  7. కొత్త పన్ను విధానంలో, అధిక సర్‌చార్జి 37% నుంచి 25%కి తగ్గించారు. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయంపై ఈ రేట్లు వర్తిస్తాయి. సర్‌చార్జ్ తగ్గింపు ఎక్కువ ఆదాయం ఉన్నవారిపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది.
  8. కొత్త పన్ను విధానంలో చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరింత ఉపశమనం కల్పించింది. రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. కానీ అదే ఆదాయం రూ. 7 లక్షల 100 రూపాయిలు అయితే, రూ. 25 వేలు పన్నువిధిస్తారు. ఈ విధంగా ప్రభుత్వం అటువంటి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఇచ్చింది, వారి ఆదాయం పన్ను రహిత ఆదాయ పరిధిని మించి ఉంటుంది.ఇది కొత్త లేదా పాత పన్ను విధానం అయినా, మీకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందో లెక్కించండి. దీని కోసం మీరు 2023-24 ఆర్థిక సంవత్సరం అంచనా ఆదాయం ప్రకారం రెండు పన్ను విధానాలలో పన్నును లెక్కించవచ్చు. అవసరమైతే, దీని కోసం పన్ను కాలిక్యులేటర్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ సహాయం తీసుకోండి. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నవారు సొంతంగానే ఈ లెక్కలు చేయవచ్చు. పన్ను విధానంతో పాటు, ఆస్తి, బీమా, డెట్ మ్యూచువల్ ఫండ్‌లకు సంబంధించిన పన్ను నిబంధనలలో మార్పులు చేశారు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం..
  9. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి LTCG ప్రయోజనం తీసివేశారు. అంటే.. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభం ఏప్రిల్ 1 నుంచి రద్దు అయింది. ఏప్రిల్ 1, 2023 తర్వాత డెట్ మ్యూచువల్ ఫండ్‌లలో చేసిన పెట్టుబడులను రీడీమ్ చేయడంపై స్వల్పకాలిక మూలధన లాభం (STCG) పన్ను వర్తిస్తుంది. అంటే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. దేశీయ ఈక్విటీలో 35% కంటే తక్కువ పెట్టుబడి ఉన్న డెట్ ఫండ్‌లకు ఈ నియమం వర్తిస్తుంది. ఇది బంగారం అలాగే అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్ పథకాలపై కూడా ప్రభావం చూపుతుంది. 31,మార్చి 2023కి ముందు చేసిన పెట్టుబడులపై LTCG ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. దీనిలో 3 సంవత్సరాల పెట్టుబడి తర్వాత రీడీమ్ చేయడం వలన ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20% పన్ను ఆకర్షిస్తుంది. హోల్డింగ్ వ్యవధి 3 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే STCG పన్ను వర్తిస్తుంది.
  10. ఖరీదైన బీమా పాలసీలపై పన్ను.. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన జీవిత బీమా పాలసీ లేదా పాలసీల మొత్తం వార్షిక ప్రీమియం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, మెచ్యూరిటీపై అందుకున్న మొత్తంపై పన్ను విధిస్తారు. ఈ నియమం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు వర్తించదు.
  11. పొదుపు మూలధన లాభాలపై పరిమితి: ఏప్రిల్ 1, 2023 నుండి సెక్షన్ 54 మరియు సెక్షన్ 54F ప్రకారం, రూ. 10 కోట్ల వరకు మూలధన లాభాలపై మాత్రమే పన్ను మినహాయింపు అందుబాటులో ఉంటుంది… ఒక వ్యక్తి ఆస్తి లేదా షేర్ల వంటి మూలధన ఆస్తి లాభం నుండి నివాస ప్రాపర్టీని కొనుగోలు చేస్తే, అప్పుడు లాభంపై పన్ను మినహాయింపు పరిమితి రూ. 10 కోట్లు మాత్రమే. దీని పైన ఉన్న మూలధనంపై పన్ను విధించబడుతుంది.

ఈ ప్రధాన మార్పులు 1 ఏప్రిల్ 2023 నుంచి అమలులోకి వచ్చాయి. ఇది కాకుండా, కొన్ని ఇతర నియమాలు కూడా మారాయి. ఆన్‌లైన్ గేమింగ్ నుంచి గెలుపొందిన వారు తీసుకునే డబ్బుపై 30% TDS విధిస్తారు. REIT – ఇన్విట్ యూనిట్ హోల్డర్‌లు రుణం తిరిగి చెల్లింపుగా స్వీకరించిన మొత్తంపై పన్ను. ఆభరణాలు లేదా నాణేలను ఎలక్ట్రానిక్ బంగారు రసీదులు (EGR), EGR భౌతిక బంగారంగా మార్చడంపై మూలధన లాభాల పన్ను వర్తించదు.సెక్షన్ 24 కింద క్లెయిమ్ చేయబడిన వడ్డీ ఇల్లు కొనుగోలు ఖర్చులో చేర్చరు. మార్కెట్-లింక్డ్ డిబెంచర్ల విముక్తి ద్వారా వచ్చే ఆదాయాలు ఇప్పుడు స్వల్పకాలిక లాభాల పన్ను పరిమితిని ఆకర్షిస్తాయి.