భారత తపాలా శాఖ టైమ్ డిపాజిట్ (TD) పథకం పెట్టుబడికి సురక్షితం, లాభదాయకం. అది ఎలా.? ఇందులో ఎంత లాభం వస్తుంది.? ఈరోజు చూద్దాం.
టైమ్ డిపాజిట్ పథకం బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) లాగా పనిచేస్తుంది. ఇందులో వడ్డీ రేట్లు ఆకర్షణీయం.
పోస్ట్ ఆఫీస్ TD పథకంలో, పెట్టుబడిదారులకు 6.9 శాతం నుండి 7.5 శాతం వరకు వడ్డీ. టీడీ పథకంలో ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు డిపాజిట్ చేయవచ్చు.
భారత తపాలా శాఖ టైమ్ డిపాజిట్ పథకంలో, కనీసం రూ. 1,000తో ఖాతాను తెరవవచ్చు, గరిష్ట డిపాజిట్ మొత్తానికి పరిమితి లేదు.
భారత తపాలా శాఖ టైమ్ డిపాజిట్ ఖాతాపై వచ్చే వడ్డీ మీరు డిపాజిట్ చేసిన పెట్టుబడి వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.
భారత తపాలా శాఖ టైమ్ డిపాజిట్ పథకంలో ఎవరైనా ఖాతా తెరవవచ్చు. ఇందులో, ఒకే ఖాతాతో పాటు, ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు.
పోస్టాఫీసు ఒక ప్రభుత్వ సంస్థ. దానిలో పెట్టుబడి పెట్టే డబ్బు పూర్తిగా సురక్షితం. పోస్ట్ ఆఫీస్ TD ఖాతాను తెరవడానికి, మీరు సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లాలి.
అక్కడ మీరు దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను సమర్పించాలి. గుర్తింపు రుజువు, చిరునామా రుజువు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో సమర్పించాలి.