Personal Loan: పర్సనల్ లోన్ పై టాప్ అప్ తీస్తున్నారా.. అప్లై చేసే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివి..
ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తిగత అవసరాలకు పర్సనల్ లోన్‌పై ఆధారపడుతున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం తక్కువ వడ్డీరేట్లతో కస్టమర్‌లను ఆకర్షిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో పర్సనల్ లోన్ తీసుకున్నా సరే, కొంత కాలానికి మళ్లీ డబ్బు అవసరం కావచ్చు. అలాంటప్పుడు ఓ లోన్ ఈఎంఐలు పూర్తికాకనే, బ్యాంకులు మరో లోన్ ఇస్తాయా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇలాంటప్పుడే పర్సనల్ లోన్ టాప్- అప్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఓ పర్సనల్ లోన్ కంటిన్యూ అవుతున్న సమయంలో టాప్- అప్ తీసుకుంటే అదనపు ఖర్చులకు హెల్ప్ అవుతుంది. టాప్- అప్ లోన్ ప్రయోజనాలు, అర్హత తెలుసుకుందాం.

కొన్ని సందర్భాల్లో పర్సనల్ లోన్ తీసుకున్నా సరే, కొంత కాలానికి మళ్లీ డబ్బు అవసరం కావచ్చు. అలాంటప్పుడు ఓ లోన్ ఈఎంఐలు పూర్తికాకనే, బ్యాంకులు మరో లోన్ ఇస్తాయా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అలాంటి వారికోసమే టాప్ అప్ ఆప్షన్. పర్సనల్ లోన్ టాప్-అప్ సౌలభ్యం అదనపు నిధులు అవసరమైనప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఉన్న లోన్ ఆధారంగా అదనపు మొత్తం రుణం తీసుకోవచ్చు, కొత్త దరఖాస్తు, ఆమోదం ప్రక్రియల ఇబ్బంది లేకుండా లోన్ ఎలా పొందాలనే విషయాలు తెలుసుకుందాం..
అర్హత
ఇప్పటికే ఆ రుణదాత వద్ద పర్సనల్ లోన్ ఉండాలి, ఎందుకంటే టాప్-అప్ లోన్ అంటే ప్రస్తుత లోన్‌కు పొడిగింపు అని గుర్తుంచకోవాలి. సాధారణంగా 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ ఈఎంఐలు చెల్లించి ఉండాలి, స్థిరమైన పేమెంట్ హిస్టరీని నిర్ధారిస్తుంది. అధిక క్రెడిట్ స్కోర్, మంచి పేమెంట్ హిస్టరీ ఉండాలి. ఎందుకంటే లోన్ ఇచ్చేవారు మీ క్రెడిట్ విశ్వసనీయతను పరిశీలిస్తారు. ఆదాయం ఆధారంగా మీరు రెండు లోన్లు (ప్రస్తుత, టాప్-అప్) సౌకర్యవంతంగా చెల్లించగలరని నిర్ధారించుకున్నాకే ఓకే చేస్తారు.
వడ్డీ రేటు
టాప్-అప్ లోన్ వడ్డీ రేటు సాధారణంగా ప్రస్తుత లోన్‌తో సమానంగా ఉంటుంది. సకాలంలో ఈఎంఐ చెల్లింపుల హిస్టరీ ఉంటే, రుణదాత తక్కువ వడ్డీ రేటు అందించవచ్చు. మనీకంట్రోల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో 8 రుణదాతలతో రూ.50 లక్షల వరకు లోన్లు అందుబాటులో ఉన్నాయి, వడ్డీ రేటు సంవత్సరానికి 10.5% నుంచి ప్రారంభమవుతుంది.
దరఖాస్తు ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు
వడ్డీ రేటు, ఫీజులు: మొత్తం రుణ భారం తగ్గించేందుకు వడ్డీ రేటు, అదనపు ఫీజులను పరిశీలించండి. కాలవ్యవధి: టాప్-అప్ లోన్ కాలవ్యవధి ప్రస్తుత లోన్‌తో సమానంగా లేదా మీ ప్రాధాన్యత ప్రకారం సర్దుబాటు చేయవచ్చు. ఆదాయ సామర్థ్యం: అదనపు రుణం మీ ఆర్థిక ఒత్తిడిని పెంచకుండా చూసుకోండి. రుణదాత ఎంపిక: వివిధ రుణదాతల ఆఫర్‌లను సరిపోల్చండి, తక్కువ వడ్డీ రేటు, సులభమైన షరతులు ఉన్నవి ఎంచుకోండి.
అవసరమైన డాక్యుమెంట్లు
గుర్తింపు రుజువు: ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ వంటివి. చిరునామా రుజువు: విద్యుత్ బిల్లు, అద్దె ఒప్పందం, బ్యాంక్ స్టేట్‌మెంట్. ఆదాయ రుజువు: ఇటీవలి జీతం స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, టాక్స్ రిటర్న్స్. లక్షణాలు, ప్రయోజనాలు
అదనపు రుణం: ఇప్పటికే ఉన్న లోన్‌పై అదనపు నిధులు పొందవచ్చు. తక్కువ డాక్యుమెంటేషన్: రుణదాతకు మీ ఆర్థిక చరిత్ర తెలిసి ఉండటంతో పత్రాలు తక్కువ అవసరం. వేగవంతమైన ఆమోదం: ఇప్పటికే ఉన్న సంబంధం వల్ల ఆమోదం వేగంగా, కొన్ని గంటల్లో రుణం జమ అవుతుంది. వడ్డీ రేటు: సకాల చెల్లింపుల చరిత్ర ఉంటే తక్కువ వడ్డీ రేటు పొందవచ్చు. చెల్లింపు కాలవ్యవధి: ప్రస్తుత లోన్ కాలవ్యవధితో సమానంగా లేదా మీ అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేయవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ
రుణదాతను సంప్రదించి టాప్-అప్ అర్హత తెలుసుకోండి. అర్హత ఉంటే వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా బ్రాంచ్ ద్వారా దరఖాస్తు చేయండి. ఆదాయ రుజువు, చిరునామా రుజువు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ప్రస్తుత లోన్ వివరాలు సమర్పించండి. వెరిఫికేషన్ తర్వాత రుణదాత టాప్-అప్ లోన్, వడ్డీ రేటు, కాలవ్యవధి నిర్ణయిస్తాడు. ఆమోదం తర్వాత మొత్తం మీ ఖాతాకు జమ అవుతుంది.
ఎవరు అందిస్తారు?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు లు టాప్-అప్ లోన్లు అందిస్తున్నాయి.