19 March 2025
Subhash
క్రెడిట్‌కార్డులతో ప్రయోజనాలు ఉండడంతో చాలామంది తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, బ్యాంకులు క్రికెట్‌కార్డులకు సంబంధించిన రూల్స్‌ను మారుస్తుంటూ వస్తుంటాయి.
మారిన ఈ రూల్స్ త్వరలోనే అమలులోకి రానున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్‌కార్డుల యూజర్లకు షాక్ ఇచ్చింది.
బ్యాంకు క్రెడిట్ కార్డు రూల్స్‌ను మార్చింది. ఎంపిక చేసిన కార్డులపై రివార్డు పాయింట్లలో భారీగా కోత. స్విగ్గీ, ఎయిర్ ఇండియా టికెట్ల బుకింగ్‌లపై రికార్డుల్లో కోత విధించింది.
స్‌బీఐ సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినం కార్డ్, ఎయిర్ ఇండియా సిగ్నేచర్ కార్డ్ హోల్డర్స్‌కు ఏప్రిల్ నుంచి రివార్డుల్లో కోత.
ఎస్‌బీఐ జారీ చేస్తున్న ప్రముఖ క్రెడిట్ కార్డుల్లో సింప్లీ క్లిక్ కార్డ్ ఒకటి. ప్రస్తుతం ఈ కార్డ్ యూజర్స్ ఇప్పటి వరకు స్విగ్గీలో లావాదేవీలపై 10X రివార్డులు పొందుతూ వచ్చారు.
ఏప్రిల్ నుంచి 5x మాత్రమే రివార్డు పాయింట్లు. అపోలో, బుక్ మైషో, క్లియర్ ట్రిప్, డామినోస్, మింత్రా ఆన్‌లైన్ కొనుగోళ్లకు మాత్రం గతంలో మాదిరిగానే 10X రివార్డు పాయింట్స్.
ఇక ఎయిర్ ఇండియా ప్లాటినం కార్డుకు ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్స్‌పై ప్రతి రూ.100కి 15 రివార్డు పాయింట్లు వచ్చేవి. మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా కొనుగోళ్లకు రివార్డ్స్ వర్తించేవి.
తాజాగా ఏప్రిల్ నుంచి కేవలం 5 రివార్డు పాయింట్లు మాత్రమే. ఎయిర్ ఇండియా సిగ్నేచర్ క్రెడిట్ కార్డుకు ప్రస్తుతం ఎయిర్ ఇండియా టికెట్‌ను బుక్ చేస్తు ప్రతి రూ.100కు 30 రివార్డు పాయింట్లు.
నెలాఖరు నుంచి రూ.100కి కేవలం పది రివార్డు పాయింట్లు మాత్రమే ఇవ్వనున్నది. రూల్స్‌కు మార్పు గురించి ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.