Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వస్తువులను కొనడమే కాదు.. అమ్మేసుకోవచ్చు కూడా.. వివరాలు ఇవి..

మరో కొత్త సర్వీస్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి వచ్చింది. కేవలం ఎక్స్ చేంజ్ మాత్రమే కాక పాత వస్తువులను విక్రయించుకునే వీలును కల్పిస్తోంది. ఆ వస్తువులు పనిచేయకపోయినా కొనుగోలు చేసేందుకు వీలుగా కొత్త సర్వీస్ ను అందిస్తోంది.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వస్తువులను కొనడమే కాదు.. అమ్మేసుకోవచ్చు కూడా.. వివరాలు ఇవి..
Flipkart
Follow us

|

Updated on: Jun 29, 2023 | 10:45 AM

ప్రముఖ ఈ ప్లాట్ ఫారం ఫ్లిప్‌కార్ట్ గురించి తెలియని వారుండరు. అంతలా జనాలకు కనెక్ట్ అయిపోయింది. వినియోగదారులకు అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. పలు రకాల ఆఫర్లు, తగ్గింపు ధరలతో అందరినీ ఆకర్షిస్తుంటుంది. అయితే ఇప్పటి వరకూ కొత్త వస్తువులను మాత్రమే మనం ఆ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయగలం. లేదా పాత వస్తువును ఎక్స్ చేంజ్ చేసుకుని కొత్త వస్తువును తీసుకొనే వీలుంది. అయితే ఇక మరో కొత్త సర్వీస్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి వచ్చింది. కేవలం ఎక్స్ చేంజ్ మాత్రమే కాక పాత వస్తువులను విక్రయించుకునే వీలును కల్పిస్తోంది. ఆ వస్తువులు పనిచేయకపోయినా కొనుగోలు చేసేందుకు వీలుగా కొత్త సర్వీస్ ను అందిస్తోంది. దీనిలో పాడైపోయిన స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు ఏవైనా విక్రయించుకోవచ్చు. వాటిల్లో టెలివిజన్, రిఫ్రిజరేటర్, వాషింగ్ మెషిన్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్లు వంటివి ఏవైనా అమ్మేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆ కష్టాలకు చెక్..

ఇంట్లో పాడైన పాత వస్తువులను ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పాత తరం టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటివి పనిరాకుండా ఉంటే వాటిని ఇంట్లోనే అలా వదిలేస్తుంటారు. వాటిని ఏం చేయాలో కూడా అర్థం కాక పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వస్తువులన్నీ ఇక మీరు బయటకు తీయండి. ఎందుకంటే ఫ్లిప్ కార్ట్ మంచి అవకాశాన్ని అందిస్తోంది. అలాంటి వస్తువులను కొనుగోలు చేస్తామని చెబుతోంది. అందుకోసం కొంతమంది వర్తకులతో ఫ్లిప్ కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. వారు వాటిని తీసుకుంటారు. అందుకు అనుగుణంగా దానికి వ్యాల్యూ కట్టి నగదు అందిస్తారు.

ఈ-వేస్ట్ పై ఫోకస్..

ఫ్లిప్ కార్ట్ ముఖ్యంగా ఈ-మేనేజ్ మెంట్ పై దృష్టి పెట్టింది. సక్రమంగా వాటిని డిస్పోస్ చేసేలా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. అందుకోసం ఆథరైజ్డ్ ఈ-వేస్ట్ వెండర్స్ తో ఫ్లిప్ కార్ట్ జట్టు కట్టింది. వినియోగదారుల నుంచి సేకరించిన ఈ-వేస్ట్ ను వారు క్రమమైన పద్ధతుల్లో డిస్పోస్ చేయడమో లేక రీ సైకిల్ చేయడమో చేస్తారు. ఒకవేళ మీరిస్తున్న వస్తువులు పనిచేస్తున్నట్లయితే వాటిని ఎక్స్ చేంజ్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది ఫ్లిప్ కార్ట్.

ఇవి కూడా చదవండి

డేటాపై భరోసా..

ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్లు వంటివి మీరు అమ్మేయాలనుకుంటే దానిలోని మీ డేటాను తొలగించే బాధ్యత ఫ్లిప్ కార్ట్ తీసుకుంటుంది. అందుకు ఆ సంస్థే మీకు భరోసా ఇస్తుంది. అంతేకాక ఫ్లిప్ కార్ట్ ఆ విక్రయాలపై బైబ్యాక్ ఆఫర్లు, అప్ గ్రేడెడ్ ఉత్పత్తుల హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్ చేంజ్ అవకాశం కల్పిస్తుంది. అలాగే పనిచేయని వస్తువులను మీ ఇంటికే వచ్చి తీసుకెళ్లే సదుపాయాన్ని కల్పిస్తుంది.

దీనిపై ఫ్లిప్ కార్ట్ రీ కామర్స్ సీనియర్ డైరెక్టర్ అండ్ బిజినెస్ హెడ్ అషుతోష్ సింగ్ చందెల్ మాట్లాడుతూ మన భారత దేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఈ-వేస్ట్ ఉత్పత్తి చేసే దేశంగా ఉందని చెప్పారు. 2019లో 3.2 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ను ఉత్పత్తి చేసిందని వివరించారు. అయితే దీనిలో 10శాతం ఈ-వేస్ట్ మాత్రమే సక్రమమైన పద్ధతుల్లో డిస్పోస్ లేదా రీసైక్లింగ్ జరుగుతుందన్నారు. అందుకే దీనిపై దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను డిస్పోజ్ చేయడానికి ఇన్నోవేటివ్, సస్టైనబుల్, కన్వీనియంట్ సొల్యూషన్ ను అన్వేషించే క్రమంలో ఫ్లిప్ కార్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని ప్రకటించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!