Bajaj Triumph: నిరీక్షణకు తెర.. బజాజ్ ట్రయంఫ్ నుంచి రెండు సూపర్ బైక్స్ రిలీజ్.. లాంచింగ్ ఎప్పుడో తెలుసా?
ట్రయంఫ్ లవర్స్ కొత్త బైక్స్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరి నిరీక్షణకు తెర తీస్తూ బజాజ్ కంపెనీ ఓ ప్రకటన చేసింది. త్వరలోనే ట్రయంఫ్‌కు సంబంధించి రెండు బైక్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బజాజ్-ట్రయంఫ్ మోటార్‌సైకిళ్లు ఎట్టకేలకు భారతదే మార్కెట్లో ప్రవేశించనున్నాయి. ట్రయంఫ్ సరికొత్త స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌లను ఆవిష్కరించింది.
భారతీయ ఆటోమొబైల్ రంగంలో సూపర్ బైక్స్ విషయంలో బజాజ్ బైక్స్‌కు ఉన్న క్రేజ్ వేరు. బజాజ్ నుంచి సూపర్ బైక్స్ రిలీజ్ అవుతున్నాయంటే యువత ఎక్కువగా కొనుగోలు ఆసక్తి చూపుతూ ఉంటారు. బజాజ్ ట్రయంఫ్ బైక్స్ అంటే సూపర్ బైక్స్‌లో ప్రీమియం బైక్స్ కింద పేర్కొంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ట్రయంఫ్ నుంచి నూతన మోడల్స్ రిలీజ్ కాలేదు. దీంతో ట్రయంఫ్ లవర్స్ కొత్త బైక్స్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరి నిరీక్షణకు తెర తీస్తూ బజాజ్ కంపెనీ ఓ ప్రకటన చేసింది. త్వరలోనే ట్రయంఫ్‌కు సంబంధించి రెండు బైక్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బజాజ్-ట్రయంఫ్ మోటార్‌సైకిళ్లు ఎట్టకేలకు భారతదే మార్కెట్లో ప్రవేశించనున్నాయి. ట్రయంఫ్ సరికొత్త స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌లను ఆవిష్కరించింది. ఈ బైక్స్ ఇటీవల లండన్‌లో రిలీజ్ చేశారు. అధికారికంగా భారతదేశంలో జూలై 5, 2023న లాంచ్ చేయనున్నారు. బజాజ్- ట్రయంఫ్ భాగస్వామ్యం కింద ఈ బైక్స్‌ను భారతదేశంలో బజాజ్ ఆటో తయారు చేస్తుంది. ఈ బైక్స్ ధర, ఇతర ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ట్రయంఫ్ ఇంజిన్, గేర్ బాక్స్
ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌లకు సరికొత్త టీఆర్ సిరీస్ 398.15సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, 4-వాల్వ్, డీఓహెచ్‌సీ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతాయి. అలాగే ఈ బైక్స్ మోటార్ 8,000 ఆర్‌పీఎం వద్ద 39.5 బీహెచ్‌పీ, 6,500 ఆర్‌పీఎం వద్ద 37.5 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తాయి. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. అలాగే ఈ బైక్స్ స్లిప్, అసిస్ట్ క్లచ్‌లతో వస్తాయి.
ట్రయంఫ్ బైక్స్ ఫీచర్లు ఇవే
ట్రయంఫ్ కొత్త 400 సీసీ మోటార్‌సైకిళ్లు హైబ్రిడ్ స్పైన్/పెరిమీటర్ ఫ్రేమ్‌పై నిర్మించారు. అలాగే 43 ఎంఎం అప్‌సైడ్-డౌన్ (యూఎస్‌డీ) ఫ్రంట్ ఫోర్క్‌లను, అలాగే వెనుక భాగంలో గ్యాస్-ఛార్జ్డ్ మోనో-షాక్ అబ్జార్బర్లతో డిజైన్ చేశారు. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్‌గా ఉన్న డిస్క్ బ్రేక్‌ల ద్వారా పర్‌ఫెక్ట్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి. ఏబీఎస్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌లో మారే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. డ్యుయల్ చేంజబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను పొందుతాయి. ఫీచర్ల పరంగా చూ్తే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌సీడీతో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అధునాతన ఫీచర్లను జోడించారు.
ధర, లభ్యత
సరికొత్త ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌లు జూలై 5, 2023న భారతదేశంలో విడుదల చేస్తారు. లాంచ్ అయిన తర్వాత, ఇవి అత్యంత సరసమైన ట్రయంఫ్ మోటార్‌సైకిళ్లుగా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ బైక్స్ ధర సుమారు రూ. 3 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చు. ఈ మోటర్ సైకిల్స్‌పై ట్రయంఫ్ రెండు సంవత్సరాల అపరిమిత కిలో మీటర్ల వారంటీ, క్లాస్-లీడింగ్ 16,000 కిలో మీటర్ల సర్వీస్ ఇంటర్వెల్‌ను అందిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..